ఎవరూ ఊహించని విధంగా ఒక రకంగా చెప్పాలీ అంటే వైసీపీ నాయకులే అనుకోని విధంగా విశాఖలో గర్జన సూపర్ సక్సెస్ అయింది. వరుణుడు అసలు కరుణించకపోయినా దాదాపుగా లక్షకు పైగా జనాలు తరలివచ్చారు. విశాఖకు రాజధాని సెంటిమెంట్ లేదన్న వారి చెంప చెళ్ళుమనిపించారు.
గర్జనకు ముందు అంతా ప్రతికూల పరిస్థితులే ఉన్నాయి. వాతావరణం అయితే అసలు సహకరించలేదు. కుండపోతలా వాన విశాఖను ముందు రోజు రాత్రి నుంచి ముంచెత్తి ఎవరికీ బయటకు అడుగు పెట్టనీయని స్థితికిలోనికి నెట్టింది. దీంతో గర్జన వాయిదా పడుతుందా అని అంతా అనుకున్నారు. అయితే వరుణుడు కాదు భూకంపం వచ్చినా గర్జన చేసే తీరుతామని వైసీపీ నేతలు ప్రకటించారు.
కానీ అనుకున్న స్థాయిలో జనాలు వస్తారా అన్న డౌట్ ఎక్కడో అందరిలోనూ ఉంది. అందరి అంచనాలూ తారుమారు చేస్తూ గర్జనకు అదిరిపోయే రేంజిలో జనాలు వెల్లువలా తరలివచ్చారు. ఏకంగా మూడున్నర కిలోమీటర్లు జోరు వానలో సైతం నడచి తన దృఢ సంకల్పాన్ని చాటుకున్నారు.
జన ప్రవాహం చూసి వైసీపీ పెద్దల ఆనందానికి అవధులు లేవు. అదే టైం లో ఏపీలోని విపక్షాలు తీస్తున్న దీర్ఘాలు మూలుగులు చూస్తూంటే సూపర్ సక్సెస్ రీసౌండ్ అక్కడ అలా వినిపించింది అంటున్నారు. టీడీపీ ఎంపీ రామ్మోహన్ అయితే రాజధాని సంగతి తరువాత రైల్వే జోన్ చూడండని ట్వీట్ తో సరిపెట్టారంటే గర్జన సూపరెహే అనిపించకమానదు. అచ్చెన్నాయుడు సైతం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం అంటూ మాట్లాడడం బట్టి చూస్తే గర్జన జనాకాన్ష స్తాయి అర్ధమయ్యే ఈ రకంగా భాష్యం చెబుతున్నారా అని వైసీపీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు.
వీటికంటే పరాకాష్ట ఏమిటి అంటే విశాఖ ఎయిర్ పోర్టులో వైసీపీ మంత్రుల కార్ల మీద జనసైనికుల దాడులు. నిజంగా కోపం ఉంటేనో లేక అక్కసుతోనో ఇలాంటివి చేస్తారని .మంత్రులు రోజా, జోగి రమేష్ అంటున్నారు. గర్జన సక్సెస్ జీర్ణించుకోలేక మా కార్ల మీద దాడులు చేశారు, ఇది మంచి విధానం కాదని అంటున్నారు.
గర్జన పొలి కేక చూసి విశాఖ జనం మనోభావాలను గమనించే బెంబేలెత్తిపోతున్నారు అని కూడా అంటున్నారు. వైసీపీ గర్జన ఫ్లాప్ అయితే ఎవరూ ఏమీ అనే సీనే లేదు. హిట్ అయింది కాబట్టే ఈ దాడులు మాటల తూటాలు అని వైసీపీ వారు అంటున్నారు. గర్జన ఒక విధంగా విపక్షాలను ఆలోచనలో పడేసింది అనే చెప్పాలి.