తమిళంలో పెద్ద హిట్ సినిమా మానాడు. వెంకట్ ప్రభు దర్శకుడు. శింబు హీరో. ఈ ఇద్దరికీ కూడా బ్రేక్ ఇచ్చిన సినిమా ఇది. నిజానికి తెలుగులో చాలా మంది హీరోలకు ఇదే కథ చెప్పి ఒప్పించలేక తమిళంలో తీసాడు వెంకట్ ప్రభు. గమ్మత్తుగా ఇప్పుడు ఇదే కథ రీమేక్ రైట్స్ ను హీరో రానా తీసుకున్నాడు. తాను, ఆసియన్ సునీల్ కలిసి ఈ సినిమాను నిర్మించబొతున్నారు.
ఈ సినిమా కోసం భలే కాంబినేషన్ ను సెట్ చేసుకున్నారు. రవితేజ-సిద్దూ ఈ సినిమాలో నటిస్తుండగా టొటల్ స్క్రిప్ట్ ను దర్శకుడు హరీష్ శంకర్ అందిస్తున్నారు. సినిమాకు దర్శకత్వ బాధ్యతలు మాత్రం అలానాటి దర్శకుడు దశరధ్ టేకప్ చేస్తున్నారు. రానా జస్ట్ నిర్మాతగా మాత్రమే వ్యవహరిస్తారు.
రీమేక్ లకు మాంచి స్క్రిప్ట్ లు రాయడంలో హరీష్ శంకర్ ది మంచి హ్యాండ్. గబ్బర్ సింగ్, గద్దలకొండ గణేష్ సినిమాలు ఈ విషయం ప్రూవ్ చేసాయి. ఇప్పుడు మానాడు కు కూడా తెలుగుకు సెట్ అయ్యే విధంగా స్క్రిప్ట్ లో మార్చులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
నిఙానికి యాజ్ ఇట్ ఈజ్ గా రీమేక్ చేయాలా? మార్పులు చేర్పులు చేయాలా? అన్న డిస్కషన్లు సాగుతున్నాయి. హరీష్ శంకర్ అయితే తన పని తాను ప్రారంభించేసారు.