పరుశురామ్ కు బై చెప్పేసారా?

గీతగోవిందం సినిమా వచ్చి, బ్లాక్ బస్టర్ గా మారి సరిగ్గా ఏడాది అయింది. ఓ మాంచి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి కూడా  ఏడాది పాటు ఖాళీగా కూర్చున్నాడు డైరక్టర్ పరుశురామ్. అలా అని…

గీతగోవిందం సినిమా వచ్చి, బ్లాక్ బస్టర్ గా మారి సరిగ్గా ఏడాది అయింది. ఓ మాంచి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి కూడా  ఏడాది పాటు ఖాళీగా కూర్చున్నాడు డైరక్టర్ పరుశురామ్. అలా అని నిర్మాతలు లేకపోలేదు, సబ్జెక్ట్ లు లేకపోలేదు. హీరోనే సెట్ కావడం లేదు. నిర్మాత అల్లు అరవింద్ ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతోనే కాంబినేషన్ సెట్ చేయాలనుకున్నారు. కానీ పరుశురామ్ తయారుచేసిన స్క్రిప్ట్ ఆయనకే నచ్చక, పక్కన పెట్టారని గ్యాసిప్ లు వినవచ్చాయి.

దాంతో తను నేరుగా ట్రయ్ చేసుకుంటా అని, కొరటాల శివ ద్వారా మహేష్ బాబు దగ్గరకు వెళ్లి స్క్రిప్ట్ వినిపించారు పరుశురామ్ అని వార్తలు వినిపించాయి. కానీ లేటెస్ట్ గా వినిపిస్తున్న గ్యాసిప్ ఏమిటంటే, పరుశురామ్ కు మహేష్ బాబు బై బై చెప్పేసారన్నది. 

మహేష్ బాబు ఈ విషయంలో చాలా గౌరవంగా, మర్యాదగా ఓ మెసేజ్ పంపించారని టాలీవుడ్ లో వినిపిస్తోంది.

'పరుశురామ్ చెప్పిన స్క్రిప్ట్ చాలా బాగుంది. అలాంటి స్క్రిప్ట్, అందులో నా కోసం తయారు చేసిన పాత్ర నిజంగా గొప్ప సృజనకు నిదర్శనం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో నేను ఆ స్క్రిప్ట్ ఓకె చేసి, ఆ పాత్ర చేయలేను. అందువల్ల పరుశురామ్ వేరే ప్రాజెక్టు చూసుకోవచ్చు' 

ఇంచుమించు ఇదే విధంగా మహేష్ బాబు ఓ మెసేజ్ ను దర్శకుడు కొరటాల శివకు పంపించినట్లు గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. పరుశురామ్ వినిపించిన స్క్రిప్ట్ లో  బ్యాంకు రుణాల ఎగవేత, స్కామ్ లాంటి వ్యవహారాలు వున్నాయని ఆ మధ్య వినిపించింది. మరి అలాంటి సీరియస్ సబ్జెక్ట్ ఫ్రస్తుతం చేయడం ఇష్టం లేక మహేష్ బాబు నో చెప్పారో? ప్రస్తుతం వంశీ పైడిపల్లితో సినిమా చేయాలనుకుంటున్నారు కనుక, ఆ తరువాత రాజమౌళి ప్రాజెక్టు రెడీగా వుంది కనుక, పరుశురామ్ ను అలా వెయిటింగ్ లో పెట్టేయడం ఇష్టం లే నో చెప్పారో తెలియదు. 

అది అలా వుంటే నిజంగా అంత మంచి సబ్జెక్ట్ అయితే అల్లు అరవింద్ కు ఎందుకు నచ్చలేదు అన్నది ఒక క్వశ్చను.

నిజంగా అంత మంచి సబ్జెక్ట్ అయితే గీతా ఆర్ట్స్ లోనే హీరో బన్నీ తో ఆ సినిమా చేసే అవకాశం వుండేది కదా? అన్నది మరో అనుమానం.