చంద్రబాబు భద్రత కోసం 97 మంది!

మాజీ సీఎం అయిన తనకు భద్రతను తగ్గించారంటూ కోర్టుకు వెళ్లిన చంద్రబాబునాయుడుకు అక్కడ ఊరట లభించింది. చంద్రబాబుకు భారీ భద్రతా ఏర్పాట్లు చేయాలని కోర్టు ఆదేశించింది. ఎంతమంది అంటే.. ఏకంగా 97 మందితో చంద్రబాబుకు…

మాజీ సీఎం అయిన తనకు భద్రతను తగ్గించారంటూ కోర్టుకు వెళ్లిన చంద్రబాబునాయుడుకు అక్కడ ఊరట లభించింది. చంద్రబాబుకు భారీ భద్రతా ఏర్పాట్లు చేయాలని కోర్టు ఆదేశించింది. ఎంతమంది అంటే.. ఏకంగా 97 మందితో చంద్రబాబుకు భద్రతను ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించడం గమనార్హం.

అలాగే చంద్రబాబు నాయుడు కాన్వాయ్ లో జామర్ వాహనాన్ని కూడా ఏర్పాటు చేయాలని హై కోర్టు ఆదేశించింది. చంద్రబాబు నాయుడు భద్రతా ఏర్పాట్లు ఎవరు బాధ్యతగా తీసుకోవాలో ఎన్ఎస్జీ , స్టేట్ సెక్యూరిటీలు మూడు నెలల్లో తేల్చుకోవాలని కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఎన్నికలు అయిపోయిన దగ్గర నుంచి చంద్రబాబు భద్రత విషయంలో తెలుగుదేశం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఏపీలో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబుకు భారీ భద్రతా సిబ్బందిని తగ్గించినట్టుగా వార్తలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు కుటుంబీకులకు కూడా ఇది వరకూ ప్రభుత్వ భద్రతా ఏర్పాట్లు ఉండేవి.

హైదరాబాద్ లో ఉండే నారా భువనేశ్వరి, నారా బ్రహ్మణిలకు, లోకేష్ కు భారీ భద్రతా ఏర్పాట్లు ఉండేవి. అలాంటి ఏర్పాట్లను ప్రభుత్వం రద్దు చేసింది. అయితే దీనిపై చంద్రబాబు నాయుడు హై కోర్టుకు వెళ్లారు. ఏకంగా తొంభై ఏడు మందితో భద్రతా ఏర్పాట్లు చేయించుకుంటున్నారు. చంద్రబాబుకు భద్రత ఓకే కానీ, మరీ తొంభై ఏడు మంది అంటే మాత్రం సోషల్ మీడియాలో కూడా జనాలు నోరెళ్లబెడుతున్నారు!