Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

దేవా కట్టాతో సాయితేజ్

దేవా కట్టాతో సాయితేజ్

ప్రతి హీరో కూడా లైనప్ విషయంలో జాగ్రత్త పడుతున్నారు. మెగా హీరో సాయిధరమ్ తేజ్ కూడా రెండు సినిమాలు లైన్లో పెట్టుకున్నాడు. ప్రస్తుతం మారుతి డైరక్షన్ లో ప్రతిరోజు పండుగే సినిమా చేస్తున్న తేజ్ తరువాత రెండు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. భోగవిల్లి ప్రసాద్ నిర్మాతగా కొత్త దర్శకుడితో ఒకటి, భగవాన్ - పుల్లారావు నిర్మాతలుగా దేవాకట్టాతో మరొకటి ఒకే చేసాడు. అయితే ఈ రెండింటిలో ఏది ముందు అన్నది మాత్రం నవంబర్ నాటికి డిసైడ్ అవుతుంది.

ఆటోనగర్ సూర్య తరువాత దేవాకట్టా తెలుగులో సినిమా చేయలేదు. బాహుబలి వెబ్ సిరీస్ ను నెట్ ఫ్లిక్స్ కోసం చేసారు. ప్రస్థానం సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు. సంజయ్ దత్ తనే హీరోగా ఈ సినిమాను స్వయంగా నిర్మిస్తున్నాడు. ఇటీవల విడుదలయిన ఆ సినిమా ట్రయిలర్ కు మంచి పేరు వచ్చింది. దేవాకట్టా మళ్లీ జనాలకు గుర్తుకు వచ్చేలా చేసింది ఆ ట్రయిలర్.

ఈ సినిమాత తరువాత దేవాకట్టా మళ్లీ తెలుగులో సినిమా చేయబోతున్నారు. ఆ సినిమానే సాయితేజ్ హీరోగా భగవాన్-పుల్లారావు నిర్మించే సినిమా. ఇదిలావుంటే యువి క్రియేషన్స్-మేర్లపాక గాంధీ కాంబినేషన్ లో సాయిధరమ్ తేజ్ సినిమా అని గత రెండు రోజులుగా ఓ గ్యాసిప్ చలామణీ అవుతోంది.

అది ప్యూర్ గ్యాసిప్ మాత్రమే అని, అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని, సాయిధరమ్ సన్నిహిత వర్గాలు స్పష్టం చేసాయి. ఆ కాంబినేషన్ లో నాగచైతన్య హీరోగా సినిమా వుంది కానీ, సాయితేజ్ తో కాదని ఆ వర్గాలు వివరించాయి.

సీమ టీడీపీ నేతలు.. సద్దు చేయడం లేదు!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?