Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఎక్స్ క్లూజివ్-టీజర్ బన్నీ డైలాగ్

ఎక్స్ క్లూజివ్-టీజర్ బన్నీ డైలాగ్

బన్నీ-త్రివికమ్ సినిమా టైటిల్ 'అల వైకుంఠపురములో' అంటూ ఎక్స్ క్లూజివ్ గా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇంట్రడ్యూసింగ్ టీజర్ రేపు రాబోతోంది. బన్నీ ఓ విషయంలో అభిమానులకు చిన్న వివరణ ఇవ్వాల్సి వుంది. అందుకోసమే ఈ ఇంట్రడ్యూసింగ్ టీజర్ ను వాడుకుంటున్నారు. ఈ మేరకు సినిమాతో సంబంధం లేకుండా చిన్న షూట్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ టీజర్ లో హీరో ఆన్సర్ చెప్పడానికి చిన్న పాజ్ తీసుకుంటాడు. దాంతో మురళీ శర్మ.. 'ఏంటీ అంత గ్యాప్ తీసుకున్నావ్' అని అడిగితే, 'తీసుకోలేదు.. వచ్చింది' అని బదులిస్తాడు బన్నీ. నా పేరు సూర్య సినిమా తరువాత బన్నీ చాలా గ్యాప్ తీసుకున్నాడు.

ఆ సినిమా వచ్చి ఏడాది దాటిపోయింది. త్రివిక్రమ్ తో సినిమా ఓకె చేసి, దాని కథ రెడీ చేసి, అన్నీ సెట్ చేసి, షూటింగ్ కు వెళ్లేసరికి పుణ్యకాలం పూర్తయిపోయింది. 2020 జనవరికి కానీ విడుదల డేట్ కుదరలేదు. అంటే ఏడాదిన్నర గ్యాప్ వచ్చినట్లు. దీనికోసం ఫ్యాన్స్ కు వివరణ ఇస్తున్నట్లుగా ఈ ఇంట్రడ్యూసింగ్ టీజర్ ను ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది.

సీమ టీడీపీ నేతలు.. సద్దు చేయడం లేదు!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?