పాపం ఒక్కోసారి అంతే..తప్పించుకుందామని చూసినా అతుక్కుపోతుంది. గాడ్ ఫాదర్ సినిమా నైజాం కొనుగోలు దారు సంగతి ఎలా వున్నా, పంపిణీ బాధ్యతలు నిర్వహించిన ఆసియన్ సునీల్ కు అలాగే అంటుకుంది. ఈ సినిమాను 15 కోట్ల రికవరీ అడ్వాన్స్ మీద పంపిణీ చేయమని అడిగారు గాడ్ ఫాదర్ నిర్మాతలు.
అంత వస్తుందా అని అనుమాన పడి నో..అన్నారు. దాంతో వాళ్లు వెదికి వెదికి ఓ మొహమాటం కేసును పట్టుకున్నారు. మొహమాటం కేసు ఎందుకు అంటే ఆ డిస్ట్రిబ్యూటర్ కు నిర్మాత ఆర్ బి చౌదరితో ఏదో మొహమాట వుంది కనుక.
సరే 18 కోట్ల నాన్ రికవరబల్, 2 కోట్ల రికవరబుల్ పద్దతిన గాడ్ ఫాదర్ సినిమా ఆ పార్టీకి ఇచ్చారు. సదరు పార్టీ గాడ్ ఫాదర్ ను పంపిణీ కోసం మళ్లీ ఆసియన్ సునీల్ దగ్గరే వుంచింది. అందుకు థియేటర్ల అడ్వాన్స్ కింద 15 కోట్ల వరకు తీసుకుంది.
ఇప్పుడేమయింది సినిమా ఇప్పటికి 11 కోట్ల వరకు మాత్రమే నైజాంలో వసూలు చేసింది. నాలుగు కోట్లు వస్తే, ఎగ్జిబిటర్ అడ్వాన్స్ రావాల్సి వుంది. ఆ తరువాత ఏమైనా వస్తే డిస్ట్రిబ్యూటర్ కు. ఎంత జిఎస్టీ ఇచ్చినా ఎగ్జిబిటర్ గా ఇచ్చిన అడ్వాన్స్ లో రెండు మూడు కోట్లు వుండిపోతుంది. 15 కోట్లు పెట్టి కొన్నా నష్టం వచ్చి వుండేది. ఇప్పుడు రికవరబుల్ నే కానీ బ్లాక్ అయిపోయింది. డిస్ట్రిబ్యూటర్ కు అయితే దాదాపు అయిదారు కోట్లు నష్టం..రెండు కోట్లు లాక్ అయిపోయినట్లే అని ట్రేడ్ వర్గాల బోగట్టా.