ఉత్తరాంధ్రాని కెలికితే ఇట్లాగే ఉంటది…

ఉత్తరాంధ్రా జీవులు సాధారణంగా సాధుజీవులు. కష్టించి పనిచేసే మనస్తత్వం. తమ పాటికి తాము పనిచేసుకుని పోతారు. తమకు ఆస్తులు హోదాలు దర్జాలు దర్పాలు కావాలని పెద్దగా ఆశపడేది ఉండదు. అందుకే ఈ ప్రాంతాలకు ఇతర…

ఉత్తరాంధ్రా జీవులు సాధారణంగా సాధుజీవులు. కష్టించి పనిచేసే మనస్తత్వం. తమ పాటికి తాము పనిచేసుకుని పోతారు. తమకు ఆస్తులు హోదాలు దర్జాలు దర్పాలు కావాలని పెద్దగా ఆశపడేది ఉండదు. అందుకే ఈ ప్రాంతాలకు ఇతర జిల్లాల నుంచి ఎవరెవరో వచ్చి నాయకులు అయినా కధా నాయకులు అయినా మౌనంగానే మద్దతు ఇచ్చారు.

అయితే ఉత్తరాంధ్రా ప్రజానీకం అదే అమయాకత్వంతో ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటే మాత్రం అసలు కుదరదు అని చరిత్ర నిరూపించింది. ఇక్కడ ఆకలి పోరాటాలు ఎన్నో జరిగాయి. చరిత్రలో వీరోచితమైన ఉద్యమాలు ఎన్నో సిక్కోలు నుంచి మొదలుపెడితే కధలు కధలుగా కనిపిస్తాయి. తమ జోలికి రానంతవరకూ ఉత్తరాంధ్రా వారు ఊరుకుంటారు, భరిస్తారు సహిస్తారు.

కానీ ఎవరైనా కోరి కెలికితే మాత్రం దానికి తగిన పరిహారాన్ని పూర్తిగా చెల్లించేవరకూ కూడా ఉత్తరాంధ్రా జనాలు నిద్రపోరు, ఇపుడు అదే జరుగుతోంది. మూడు రాజధానులు అన్నప్పుడు విశాఖ ఒక రాజధానిగా చే స్తామని చెప్పినపుడు కూడా సైలెంట్ గానే సంతోషించారు తప్ప రోడ్లెక్కి గర్జించలేదు. ఎపుడైతే అమరావతి పాదయాత్ర పేరిట ఉత్తరాంధ్రాకు వస్తామని చెప్పి కవ్వించారో అపుడే ఉత్తరాంధ్రా రగులుకుంది.

మీ గడప తొక్కి మీకే మంచి కాకుండా దేవుడికి మొక్కుతామంటే ఎవరైనా చూస్తూ ఊరుకుంటారా. మీ జోలికి మేము రాలేదు కదా మా జోలికి ఎందుకు మీరు వస్తున్నారు అని సహజంగానే అడుగుతారు. అందుకే ఉత్తరాంధ్రా మళ్లీ దశాబ్దాల నాటి తమ పౌరుషాన్ని బయటకు తీసింది ఉత్త ఆంధ్రులు అనుకుంటే పొరపాటు గట్టి ఆంధ్రులమే అని చాటి చెప్పింది.

విశాఖ గర్జనకు అనూహ్యంగా జనాలు వచ్చారు. అతి పెద్ద వర్షం, విశాఖ అంతా జలమయమైపోయింది. ఉత్తరాంధ్రా జిల్లాలు అదే పనిగా వానలో నాని ముద్ద అవుతున్నాయి. అయినా కూడా వేలాదిగా జనాలు తరలివచ్చారు అంటే వారి దృఢ సంకల్పం ఏంటో అర్ధం చేసుకొవాలి. జనాలను తరలించారు అని విమర్శించవచ్చు. ఎంత తరలించినా ఎడతెరిపి లేకుండా కురిసే వానలో గంటల తరబడి పాదయాత్ర చేయడం అంటే కుదిరే పని కాదు, అలాగే నేతల స్పీచు లను ఆద్యంతం వినడమూ అసలు వల్ల కాదు.

కానీ విశాఖ గర్జనకు స్వచ్చందంగా కూడా వేలాదిగా తరలిరావడం వల్లనే ఇది సాధ్యపడింది. విద్యార్ధులు అధ్యాపకులు మేధావులు ప్రజా సంఘాలు కూడా గట్టి మద్దతుగా నిలిచారు. తొలిసారిగా విశాఖ గర్జించింది. మా జోలికొస్తే మేము చూస్తూ ఊరుకోమని చాటి చెప్పింది. మమ్మల్ని కెలికితే ఇట్లాగే ఉంటుందని కూడా ధీటైన జవాబు చెప్పింది..

భారీ వానలో సూపర్ సక్సెస్ అయిన విశాఖ గర్జన సాక్షిగా ఉత్తరాంధ్రా జనం చెప్పే మాట ఒక్కటే. ఇది అంతం కాదు ఆరంభం. అంటే విశాఖ రాజధాని కోసం ఎందాకైనా అన్న నినాదమే ఇపుడు ఉత్తరాంధ్రాకు తారకమంత్రం అయింది. ఈ విధంగా ఉత్తరంధ్రాలో అణగి ఉన్న చైతన్యాన్ని తిరిగి రగిలించిన అమరావతి పాదయాత్రకు ధన్యవాదాలు చెప్పుకోకోకుండా ఎవరైనా ఉండగలరా.