అనిరుధ్ పాడితే..వైరల్ నే

తమిళ నాట యువ సంగీత సంచలనం అనిరుధ్. కానీ మన సినిమాలకు అతగాడి సంగీతం ఎందుకో అంతగా సెట్ కాదు. తను చేసిన సినిమాల్లో పాటలు హిట్ కావడం కంటే అతగాడు పాడిన పాటలు…

తమిళ నాట యువ సంగీత సంచలనం అనిరుధ్. కానీ మన సినిమాలకు అతగాడి సంగీతం ఎందుకో అంతగా సెట్ కాదు. తను చేసిన సినిమాల్లో పాటలు హిట్ కావడం కంటే అతగాడు పాడిన పాటలు పెద్ద హిట్ కావడం స్పెషల్. 

నాని గ్యాంగ్ లీడర్ సినిమా కోసం చేసిన టైటిల్ సాంగ్ ఇప్పటికీ మారు మోగుతోంది. త్వరలో ఎన్టీఆర్- కొరటాల శివ సినిమా కోసం పని చేయబోతున్నాడు. ఈ లోగా విష్వక్ సేన్ లేటెస్ట్ సినిమా ఓరి దేవుడా కోసం మాంచి పాట పాడాడు. అది ఇప్పుడు వైరల్ అవుతోంది. 

‘గుండెల్లోనా..గుండెల్లోనా..గూడే కట్టేసి..గువ్వలా నిన్నే చూసుకుంటానే’. అనే ఈ పాటు బుజ్జ‌మ్మా అనే హుక్ లైన ఇప్పుడు కుర్రకారు కు కాలర్ ట్యూన్ గా మారుతోంది. అనిరుధ్ రాసిన ఈ పాటకు లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. కాసర్ల శ్యామ్ రచన అందించారు.

విశ్వక్ సేన్ అండ్ టీమ్ మీద పాట చిత్రీకరించిన తీరు కూడా బాగుంది. తమిళ సినిమా ఓ మై కడవలే కు తెలుగు రీమేక్ ఓరి దేవుడా. పివిపి నిర్మిస్తున్న ఈ సినిమా ఈ వారం థియేటర్లలోకి రాబొతోంది. విశ్వక్ సేన్ ఆ మధ్యనే ఓ హిట్ కొట్టాడు. ఇది కూడా క్లిక్ అయితే ఇక చెప్పనక్కరలేదు. ఇప్పటికే ఫుల్ బిజీగా వున్న విశ్వక్ మరింత బిజీ అయిపోతాడు.