నిన్న ఒక తెలుగు ఓటీటీలో ప్రసారమైన బాలకృష్ణ షోపై మంత్రి అంబటి రాంబాబు తనదైన శైలిలో స్పందించారు. 27 సంవత్సారల క్రితం చంద్రబాబుపై పడిన వెన్నుపోటు అనే రక్తపు మరకను తుడిచి వేసుకోవాడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా చేసిన షోగా అభివర్ణించారు. చంద్రబాబు షో లో చెప్పినవన్నీ అబద్దాలేనన్నారు.
బాలయ్య అమాయకుడు, అసమర్ధుడు కాబట్టే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారని.. అర్హత లేకపోయినా అందలం ఎక్కారని విమర్శించారు. అసెంబ్లీకి రాని వ్యక్తి రియలిటి షోలకు మాత్రం వెళుతున్నారని సెటైర్లు వేశారు. వైయస్ఆర్ స్నేహితుడు అని చెప్పిన చంద్రబాబు.. ఎందుకు రాజశేఖర్ రెడ్డి వెంట తిరిగారని చెప్పలేదని విమర్శించారు. ఎందుకంటే డబ్బు కోసమే చంద్రబాబు రాజశేఖర్ రెడ్డి వెంట తిరిగారన్నారు.
ఈ షోలో చంద్రబాబు తో సహా లక్ష్మీపార్వతి, నాదెండ్ల భాస్కరరావు ను ముందు పెట్టి షో చేసి ఉంటే బాగుండేదని సలహా ఇచ్చారు. ఈ షో వల్ల బాబు వెన్నుపోటు గురించి తెలియని వారికి కూడా తెలుస్తుందన్నారు. గతంలో ఈ షోకు హీరోలను మాత్రమే పిలిచేవారని.. కానీ ఇప్పుడు విలన్ ను పిలిచారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అలాగే నారా లోకేష్ ను పొలిటికల్ జోకర్ గా అభివర్ణించారు. లోకేష్ స్విమ్మింగ్ పూల్ ఫోటో ఒక్కటే చూపించారని.. ఇంకా చాలా ఫోటోలు ఉన్నాయని.. వాటికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. బాలకృష్ణ తన అల్లుడు మంగళగిరిలో ఓటమిపై అడిగిన ప్రశ్న.. తన బావ చంద్రబాబు చంద్రగిరిలో ఎందుకు ఓడిపోయారని అనేది అడిగలేదని విమర్శించారు.