తేజ సజ్జా-ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో తయారవుతున్న పాన్ ఇండియా సినిమా ‘హనుమాన్’ చిన్నగా ప్రారంభించిన ఈ సినిమా ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ కు వెళ్లిపోయింది.
టీజర్ కు వచ్చిన రెస్పాన్స్ చూసి, సినిమా రేంజ్ ను పెంచుకుంటూ వెళ్లిపోయారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రాఫిక్స్ విషయంలో పాయింట్ వన్ పర్సంట్ కూడా కామెంట్ రాకూడదని, టైమ్ తీసుకుని మరీ చేస్తున్నారు. అందుకే ఆరు నెలలు దూరంగా సంక్రాంతికి విడుదల డేట్ వేసారు.
సంక్రాంతికి చాలా సినిమాలు వస్తున్న నేపథ్యంలో హనుమాన్ వస్తుందా, రాదా అన్న అనుమానాలు వున్నాయి. కానీ పక్కా ఫిక్స్ అంటోంది యూనిట్. ఈ సినిమాను నార్త్ బెల్ట్ లో విడుదల చేయడం అన్నది కీలకంగా పెట్టుకున్నారు. అక్కడ మంచి రేంజ్ కు వెళ్తుందని ఆశిస్తున్నారు.
అనిల్ టాండన్ తో టై అప్ పెట్టుకుని విడుదల చేస్తున్నారు. బాలీవుడ్ లో ఒకసారి డేట్ లాక్ చేసాక, అటు ఇటు వెళ్లడం కాస్త కష్టం. అందుకే సంక్రాంతికి ఫిక్స్ అంటోంది యూనిట్. అదీ కాక, జనవరిలో రామజన్మభూమి అయోధ్యలో రామమందిరం ప్రతిష్ట, ప్రారంభం వుంది. దానికి ముందు నెల అంతా, దేశం అంతటా ధార్మిక ప్రచార కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నారు.
ఇలాంటి సీజన్ లో, ముఖ్యంగా నార్త్ బెల్ట్ లో హనుమాన్ సినిమా విడుదలయితే, ఫలితం వేరుగా వుంటుంది. అందుకే సంక్రాంతికి హనుమాన్ సినిమా పక్కా అంటోంది యూనిట్.