ఆర్థిక కారణాలే సుశాంత్ ఆత్మహత్యకు కారణమా?

నిన్న ముంబయిలోని తన నివాసంలో ప్రాణాలు విడిచిన సుశాంత్ ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అతడి మరణంపై సీబీఐ విచారణ జరిపించాలని కుటుంబ సభ్యులతో పాటు బిహీర్ కు చెందిన ఓ రాజకీయ…

నిన్న ముంబయిలోని తన నివాసంలో ప్రాణాలు విడిచిన సుశాంత్ ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అతడి మరణంపై సీబీఐ విచారణ జరిపించాలని కుటుంబ సభ్యులతో పాటు బిహీర్ కు చెందిన ఓ రాజకీయ పార్టీ డిమాండ్ చేస్తోంది. మరోవైపు సుశాంత్ మాత్రం డిప్రెషన్ వల్లనే చనిపోయాడని అంటున్నారు చాలామంది. ఈ క్రమంలో “ఆర్థిక సమస్యలు” అనే అంశం కూడా తెరపైకి వచ్చింది.

చాలామంది నటీనటులు తనువు చాలించడానికి ఇది కూడా ఓ కారణం. ఆర్థిక కారణాల వల్ల ఆత్మహత్యలు చేసుకున్న నటీనటులు చాలామంది ఉన్నారు. సుశాంత్ ది కూడా ఈ కోవకు చెందిన మరణమే అయి ఉండొచ్చని కొంతమంది అనుమానం వ్యక్తంచేశారు. అయితే సుశాంత్ బంధువులు మాత్రం ఈ విషయాన్ని కొట్టిపారేస్తున్నారు. అతడికి ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవంటున్నారు. పైపెచ్చు ఆస్తులు బాగా కూడబెట్టాడని కూడా చెబుతున్నారు.

సినిమాకు 6 నుంచి 7 కోట్ల రూపాయల వరకు తీసుకునేవాడట సుశాంత్. వీటికి తోడు పలు యాడ్స్ లో నటించాడు. ప్రతి యాడ్ కు కోటి రూపాయలు తక్కువ కాకుండా తీసుకునేవాడు. సంపాదించిన డబ్బును ముంబయిలోని ఓ ప్రముఖ రియల్  ఎస్టేట్ కంపెనీతో కలిసి బిజినెస్ లో పెట్టాడు. ఆ విధంగా కూడా బాగానే ఆర్జించాడు. సుశాంత్ చనిపోయిన ఫ్లాట్ కూడా చాలా ఖరీదైనది.

అంతేకాదు.. సుశాంత్ కు ల్యాండ్ రోవర్ లాంటి ఖరీదైన కారు, బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన ఖరీదైన బైక్స్ ఉన్నాయి. మొత్తంగా సుశాంత్ ఆస్తుల విలువ 60 కోట్ల నుంచి 70 కోట్ల రూపాయల వరకు ఉంటుందని ఓ అంచనా. కాబట్టి ఆర్థిక సమస్యలతో అతడు ఆత్మహత్య చేసుకున్నాడనే వాదనలో నిజం లేదంటున్నారు బంధువులు.

మరోవైపు ఛారిటీలో కూడా సుశాంత్ ముందుండేవాడు. కేరళలో వరదలొస్తే కోటి రూపాయలు విరాళంగా ఇచ్చాడు. అలాగే నాగాల్యాండ్ కు కూడా కోటి పాతిక లక్షలు విరాళంగా ఇచ్చాడు. మహారాష్ట్ర, బిహార్ (సుశాంత్ సొంత రాష్ట్రం)లో ఎన్నో ఛారిటీలకు లక్షల్లో విరాళాలు ప్రకటించాడు. ఇలాంటి వ్యక్తి ఆర్థిక కారణాలతో మరణించాడని అనడం సమంజసం కాదంటున్నారు.

మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. సుశాంత్ భారీగా డబ్బులు పెట్టి చంద్రుడిపై ఓ ఫ్లాట్ కూడా కొనుగోలు చేశాడు. తన ఫ్లాట్ ను చూసేందుకు ఇతడు అత్యంత శక్తిమంతమైన టెలీస్కోప్ కూడా కొనుక్కున్నాడు.

బాబు లోకేష్.. వణుకు పుడుతోందా?

ఈ బురద బీసీలందరికీ అంటిస్తునాడు