ఇన్ని రోజులు నందమూరి బాలకృష్ణ ఒక్కడే నటుడు అనుకున్నాం కానీ బాలకృష్ణ మించిన నటులుగా కనపడ్డారు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ లలో. తమపై పడిన ముద్ర కవర్ చేసుకోవడం కోసమే బాలకృష్ణ యాంకర్ గా ఉన్న ఓటీటీ షోకు తండ్రి, కోడుకులు వచ్చినట్లు కనపడింది.
ముఖ్యంగా నారా లోకేష్ పై ఉన్న ముద్ర ని ఎలాగైనా తన మామ తొలగించడానికి గట్టిగా ప్రయత్నించారు. స్విమ్మింగ్ పూల్లో విదేశీ అమ్మాయిలతో జలకాలు ఆడుతూ, బీచ్ లో తిరుగుతూ దిగిన లోకేష్ ఫోటోలను చూపిస్తూ వీటిపై నీ అభిప్రాయం ఏంటి అనగా.. అందులో తప్పేముంది నాతో ఉన్న వారు అందరూ తన ఫ్రెండ్స్ అంటూ వారు అందరూ తన భార్య బ్రాహ్మిణి కూడా కామన్ ఫ్రెండ్స్ కావాలంటే ఫోటో ఫ్రేమ్ కట్టిస్తా’ అని తనదైన శైలిలో సమాధానం చెప్పారు. దాంతో తన మామతో పాటు బాబు కూడా లోకేష్ ను చూసి మురిసిపోయారు.
అలాగే గత అసెంబ్లీ ఎన్నికల్లో నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడాని కూడా బాగా కవర్ చేశారు. ఈ విషయంపై లోకేశ్ స్పందన అడగ్గా.. ‘ఎక్కడైతే నేను ఓడిపోయానో..తిరిగి అక్కడే గెలవాలని ప్రయత్నిస్తున్నాను. మూడేళ్ల నుంచి నేను మంగళగిరిలో నే తిరుగుతున్నాను’ అని చెప్పుకొచ్చారు. ఎవరైనా చెప్పెది ఇదే కదా. అసలు ఎందుకు ఓడిపోయారో సమాధానం చెప్పకపోవడం గమన్హాం.
బాలయ్య ఇంక అల్లుడును అడగాల్సింది ఏంటంటే తనకు 'నిక్ నేమ్' ఎందుకు వచ్చింది దాని పొగొట్టుకొవడం కోసం ఎటూ వంటి ప్రయత్నం చేస్తున్నావు?, అలాగే టీడీపీ పగ్గాలు ఎప్పుడు చేపడుతావ్?, మా బావ చంద్రబాబుకు ఎప్పుడు విశ్రాంతి ఇస్తావు? అనే ప్రశ్నలు కూడా అడిగితే బాగుండేది అంటున్నారు టీడీపీ అభిమానులు.