మావోయిస్టు సంబంధాల కేసులో ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను నిర్దోషిగా విడుదల చేస్తూ బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ తీర్పు నిచ్చింది.
ప్రొఫెసర్ సాయిబాబాకు నిషేధిత మావోయిస్ట్ సంస్థలతో ఎలాంటి సంబంధాలు లేవని, ఆయన్ను వెంటనే రిలీజ్ చేయాలని ఆదేశించింది. ఈ కేసులో మరో ఐదుగురు దోషుల అప్పీల్‌ను కూడా ధర్మాసనం అనుమతించి వారిని నిర్దోషులుగా ప్రకటించింది. ఐదుగురిలో ఒకరు అప్పీలు విచారణలో ఉండగానే మరణించారు.
తనకు జీవిత ఖైదు విధిస్తూ ట్రయల్ కోర్టు 2017లో ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ జీఎన్ సాయిబాబా దాఖలు చేసిన అప్పీల్‌ను జస్టిస్ రోహిత్ డియో, అనిల్ పన్సారేలతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేప్పటి నిర్దోషిలుగా ప్రకటించింది. శారీరక వైకల్యం కారణంగా వీల్‌చైర్‌లో ఉన్న జీఎన్ సాయిబాబా ప్రస్తుతం నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో ఉన్నారు.