తెలంగాణలో జరుగుతున్న మునుగోడు ఉప ఎన్నికలు నామినేషన్ పర్వం ఈ రోజుతో ముగిసిపోతుంది. జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్న టిడిపి అలాగే బిజెపితో ఉంటూ టిడిపితో కలిసి ఉండే జనసేన తెలంగాణలో జరగబోతున్న మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నట్లు కనపడుతుంది. ఇవాళ నామినేషన్లు ముగుస్తున్న కూడా ఇంకా ఇరు పార్టీల నుండి అభ్యర్థులను నిలబెట్టినట్లు కనపడట్లేదు.
చంద్రబాబు ఏమో కేసీఆర్ మీద భయము, బిజెపి మీద గౌరవంతో పోటీకి దూరంగా ఉండబోతున్నట్లు కనపడుతోంది. పవన్ కళ్యాణ్ కూడా బిజెపి మీద గౌరవం కేసీఆర్ మీద భయంతో మునుగోడు ఉప ఎన్నికల్లో దూరంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇరు పార్టీలు పోటీ చేస్తే టీఆర్ఎస్- బీజేపీ నేతలకు ఎవరి నష్టం వచ్చిన వారి నుండి వచ్చే సమస్యలను ముందే ఉహించుకొని ఇద్దరు సైలెంట్ గా ఉండబోతున్న కనపిస్తోంది.
బహుశా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా వచ్చే తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో కూడా పోటీలు దూరంగా ఉంటారా అని భయపడుతున్నారు తెలంగాణలోని ఇరు పార్టీ నాయకులు. ఎందుకంటే అప్పుడు కూడా బిజెపి, టీఆర్ఎస్ ల మధ్యలోనే పోటీ జరుగుతుంది కాబట్టి. ఒక్కరు అంటే భయము మరోకరిపై గౌరవముతో పోటీకి దూరంగా ఉండిన ఉండొచ్చు అంటూన్నారు రాజకీయ విశ్లేషకులు.
ఎన్నికల్లో నిలబడనప్పుడు తెలంగాణ ప్రాంతంలో రాజకీయం చేయడం ఎందుకో వీరి ఇరువురికే తెలియాలి. బహుశా చంద్రబాబు నాయుడు జాతీయ అధ్యక్షుడు అనే పదం తీసేసి ఆంధ్రప్రదేశ్ టిడిపి అధ్యక్షుడిగా పెట్టుకుంటే కనీస గౌరవం అయిన నిలబడుతుంది అంటున్నారు టిడిపిలోని తెలంగాణ నేతలు. ఇలా ప్రతి ఎన్నికలకు భయపడుతూ దూరంగా ఉండటం కంటే శాశ్వతంగా ఇరు పార్టీలు తెలంగాణ శాఖను తొలగించుకుంటే మంచిది కదా.