కష్టాల్లో వుంటూనే ఎలాగైనా నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తూంది ఆహా ఓటిటి. బాలయ్య చాట్ షో అన్ స్టాపబుల్, ఓంకార్ డ్యాన్స్ ఐకాన్ లు వుండగానే లేటెస్ట్ గా మరో షో కి తెరతీస్తోంది.
ఒక విధంగా ఆన్ లైన్ టీవీ గా మారుతోంది ఆహా. టీవీల్లో వుండే కార్యక్రమాలే ఓటిటి ప్లాట్ ఫారమ్ మీద అందిస్తోంది. చాట్ షో లు, డ్యాన్స్ షో లు అలా టీవీల్లో తెచ్చుకు వచ్చిన ఐడియాలే. వాటికి సినిమా చమక్కులు అద్దుతున్నారు.
ఇదిలా వుంటే జబర్దస్త్ షో నుంచి బయటకు వచ్చిన కొంత మంది వేరే చానెళ్లలో రకరకాల పేర్లతో ట్రయ్ చేసారు. జీ టీవీ, మా టీవీల్లో షో లు చేసారు కానీ ఆశించిన రేంజ్ కు వెళ్లలేదు. దీంతో ఇప్పుడు అవే టీమ్ ల్లోని కొందరి తీసుకుని ఆహా లో కొత్తగా ప్రయత్నిస్తున్నారు.
కామెడీ ఎక్స్ చేంజ్ అంటూ ఓ షో చేయబోతున్నారు. ఆ మధ్య ఒక చానెల్ లో కామెడీ షో ను హోస్ట్ చేసిన దీపిక పిల్లి, సుడిగాలి సుధీర్ నే ఈ షో కు హోస్ట్ లు గా వుంటారు. వివిధ సినిమా సెలబ్రిటీలు టీమ్ ల వారీ జడ్ఙ్ లు గా వుంటారు. జబర్దస్త్ షో లో పాపులర్ అయిన నటులే జీ, మా చానెళ్లలో షో లు చేసారు. మళ్లీ వారే ఇప్పుడు ఆహా లోకి వస్తున్నారు.