నితిన్ తో సినిమా చేసిన తరువాత రైటర్ కమ్ డైరక్టర్ కృష్ణ చైతన్య సినిమా ఇప్పటి వరకు స్టార్ట్ కాలేదు. అయితే మొన్నటికి మొన్న హీరో శర్వానంద్..పీపుల్స్ మీడియా కాంబినేషన్ లో సినిమా పూజ జరిగింది. మొత్తానికి ఓ సినిమా చేతిలోకి వచ్చింది అనుకున్నారంతా. కానీ లేటెస్ట్ సమాచారం ఏమిటంటే ఇప్పుడు ఆ సినిమాను శర్వానంద్ పక్కన పెట్టారన్నది.
శర్వానంద్ ఎందుకు ఈ ప్రాజెక్టును పక్కన పెట్టారన్నది ఇంకా తెలియదు. ప్రస్తుతానికి మరో డైరక్టర్ తో ప్రాజెక్టు సెట్ చేసి దాన్ని పీపుల్స్ మీడియాలో చేయాలని అనుకుంటున్నారు అన్నది సమాచారం.
పెద్దగా సక్సెస్ లు లేని శ్రీరామ్ ఆదిత్యతో ఒక సినిమా చేయాలని శర్వా అనుకుంటున్నట్లు తెలుస్తోంది. బహుశా ఆ సినిమాను పీపుల్స్ మీడియాకు సెట్ చేసే అవకాశం వుందని తెలుస్తోంది.
ఒకే ఒక జీవితం తరువాత శర్వానంద్ బాగా ఆచి తూచి సబ్జెక్ట్ లు ఎంచుకుంటున్నారు. రీమేక్ లు అస్సలు చేయకూడదని డిసైడ్ అయ్యారు. అలాగే కొత్త తరహా కథల కోసం చూస్తున్నారు.