మార్కెటింగ్ కోసమేనా ఎన్టీఆర్ లుక్

ఆగస్టు 15 సందర్భంగా ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ లుక్ రాబోతోంది. కొమరమ్ భీమ్ పాత్ర స్ఫూర్తిగా ఎన్టీఆర్ పాత్రను రాజమౌళి డిజైన్ చేసారు. ఆ గెటప్ లో ఎన్టీఆర్ ఎలా వుండబోతున్నాడో…

ఆగస్టు 15 సందర్భంగా ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ లుక్ రాబోతోంది. కొమరమ్ భీమ్ పాత్ర స్ఫూర్తిగా ఎన్టీఆర్ పాత్రను రాజమౌళి డిజైన్ చేసారు. ఆ గెటప్ లో ఎన్టీఆర్ ఎలా వుండబోతున్నాడో అన్నది కాస్త ఆసక్తికరమే. ఫ్యాన్స్ కి అయితే పండగే. అయితే ఇంకా చాలా దూరం వుంది ఆర్ఆర్ఆర్ విడుదలకు. కానీ ఇప్పుడు లుక్ విడుదల వెనుక రాజమౌళి మార్కెటింగ్ స్ట్రాటజీ వుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.

వాస్తవానికి ఆర్ఆర్ఆర్ సినిమా మార్కెటింగ్ కు వచ్చిన ఢోకా లేదు. జనాలు పోటీపడి మరీ కొనుక్కుంటారు. కానీ అదికాదు సమస్య. రాజమౌళి-దానయ్య అనుకున్న రేట్లు రావాలి. అది రావాలంటే సినిమాకు క్రమేపీ హీట్ పెంచాలి. ఆ విషయంలో రాజమౌళిని మించిన డైరక్టర్ లేరు.

త్రివిక్రమ్ లాంటి వాళ్లు సినిమాను తీయడంలో తలమునకలవుతారు తప్ప, నిర్మాత సమస్యలు, బజ్ పెంచడం, ఇలాంటివి పట్టించుకోరు. కానీ రాజమౌళి అలాకాదు, సెల్ఫ్ మార్కెటింగ్, సినిమా మార్కెటింగ్ లాంటి ఆధునిక పద్దతులు బాగా తెలుసు.

అందుకే ఆర్ఆర్ఆర్ విషయంలో అడుగు ముందుకు వేసి, ఎన్టీఆర్ స్టిల్ వదులుతున్నారు. అది కూడా అటు సైరా, ఇటు సాహో లాంటి సినిమాలు కీలక పబ్లిసిటీ మెటీరియల్ వదుల్తున్న టైమ్ లో. వాటితో పోటీపడి మరీ ఫ్యాన్స్ షేర్ చేసుకునేలా, బజ్ పెరిగేలా వుండాలి ఆ లుక్. కచ్చితంగా వుంటుంది కూడా. 

ప్రాంతీయ భాషల సినిమాలు అదుర్స్!