పూరి-విజయ్.. సరైన టైమ్ లో అనౌన్స్ మెంట్

సినిమా రంగంలో ఓ టెక్నిక్ వుంది. సినిమా వెనుక సినిమా ప్రకటించడం అనే ఈ టెక్నిక్ ను రకరకాల ప్రయోజనాలు ఆశించి చేస్తుంటారు. సాధారణంగా ఓ సినిమా విడుదల చేస్తుంటే మరో సినిమా ప్రకటించడమో?…

సినిమా రంగంలో ఓ టెక్నిక్ వుంది. సినిమా వెనుక సినిమా ప్రకటించడం అనే ఈ టెక్నిక్ ను రకరకాల ప్రయోజనాలు ఆశించి చేస్తుంటారు. సాధారణంగా ఓ సినిమా విడుదల చేస్తుంటే మరో సినిమా ప్రకటించడమో? లేదా స్టార్ట్ చేయడమో చేస్తారు? ఎందుకంటే ఆర్థికంగా ఏమైనా సమస్యలు వున్నా, అలాంటి వ్యవహారాలు ఏమైనా వున్నా ప్రెజర్ రాకుండా వుండడానికి. సరే, మరో సినిమా వుంది కదా? చూసుకుందాం అని కాస్త నెమ్మదిస్తారు.

పూరి జగన్నాధ్-విజయ్ దేవరకొండల కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ మెంట్ వచ్చింది. అయితే ఇది ఇప్పటి నుంచే కాదు, జనవరి తరువాత సంగతి. కానీ ముందుగా ఎందుకు ప్రకటించినట్లు? ఈ వార్తను ఇలా గ్యాసిప్ లకు వదిలేయవచ్చు. కానీ దీని పరమార్థం వేరే వుంది.

పూరి-రామ్ ల ఇస్మార్ట్ శంకర్ ను చాలా అంటే చాలా రీజనబుల్ రేట్లకు అమ్మేసారు. అప్పటి పరిస్థితి అది. పూరి టైమ్ బాలేదు. రామ్ ఫ్లాపుల్లో వున్నాడు. నిర్మాత చార్మి ఎంత ట్రయ్ చేసినా సినిమాకు ఆశించిన మేరకు రేట్లు రాలేదు. ఆ సినిమా మీద అంత అంచనాలు లేక దిల్ రాజు లాంటి వారు కూడా డిస్ట్రిబ్యూషన్ ట్రయ్ చేసారు కానీ, కొనడానికి ముందుకు రాలేదు. ఆఖరికి రీజనబుల్ రేట్లకు ఇచ్చారు.

అయితే ఇక్కడ చిన్న కలిసి వచ్చిన అంశం ఏమిటంటే ఔట్ రేట్ అమ్మకుండా నాన్ రిటర్నబుల్ అడ్వాన్స్ ల పద్దతిలో ఇచ్చారు. అంటే ఆ అమౌంట్ దాటాక వచ్చేదాంట్లో, అంటే ఓవర్ ఫ్లోస్ లో నిర్మాతకు వాటా వుంటుంది. అది కూడా ఎక్కువ వాటా. కానీ టాలీవుడ్ లో సమస్య ఏమిటంటే, నిర్మాత గట్టివాడైతేనే ఓవర్ ఫ్లోస్ లో షేర్ వస్తుంది. లేదూ అంటే డిస్ట్రిబ్యూటర్ల దగ్గర నుంచి రావడం అంత వీజీ కాదు.

గీతా, దిల్ రాజు, లాంటి సంస్థలు అయితే లెక్కల తొక్కలు తీసి, ముక్కుపిండి మరీ ఓవర్ ఫ్లోస్ లెక్కలు తేలుస్తాయి. లేదూ మైత్రీ, హారిక లాంటి పెద్ద సంస్థలు అయితే పర్మనంట్ బయ్యర్లు కాబట్టి, అంతా కాకుంటే కొంత అయినా ఓవర్ ఫ్లోస్ వస్తాయి. అలాకాకుండా వేరే వాళ్లు అయితే ఓవర్ ఫ్లోస్ లో షేర్ అన్నది కాస్త డవుటే.

ఇప్పుడు పూరి-చార్మి విషయానికి వస్తే, ఈ సినిమాకు ఆంధ్ర ముగ్గురు, నైజాం ఒక్కరు, మొత్తం నలుగురే బయ్యర్లు. ఇస్మార్ట్ శంకర్ ఇప్పటికీ మంచి షేర్ రాబడుతోంది. మాంచి ఓవర్ ఫ్లోస్ లాభాలు రావాలి. అది వసూలు చేసుకోవడానికి ఈ కాంబినేషన్ సినిమా ప్రకటన పనికి వస్తుంది.

ఎప్పుడైతే పూరి-విజయ్ లాంటి క్రేజీ కాంబినేషన్ వుందో, బయ్యర్లు వాళ్ల గుడ్ లుక్స్ లో వుండి అది కూడా తాము తీసుకోవాలని అనుకుంటారు. ఇప్పుడు ఓవర్ ఫ్లోస్ దగ్గర పూరి-చార్మిని డ్యాన్స్ ఆడిస్తే, రేపు విజయ్ సినిమా టైమ్ లో వాళ్లను పక్కన పెడతారు. ఈ టైమ్ లో పూరి-చార్మి గుడ్ లుక్స్ లో వుండాలనే ఏ బయ్యర్ అయినా చూస్తారు. అందువల్ల ఓవర్ ఫ్లోస్ విషయంలో కాస్త ఉదారంగా వ్యవహరించే అవకాశం వుంది.

ఆ విధంగా ఈ అధికారిక ప్రకటన వాల్యూ కొన్ని కోట్లలో వుంటుంది అంటే అతిశయోక్తి కాదు.

ప్రాంతీయ భాషల సినిమాలు అదుర్స్!