Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బన్నీ-త్రివిక్రమ్... వైకుంఠపురంలో..

బన్నీ-త్రివిక్రమ్... వైకుంఠపురంలో..

బన్నీ-త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా టైటిల్ మరో రెండు రోజుల్లో రాబోతోంది. ఆసక్తికరమైన టైటిళ్లు పెట్టడంలో అందెవేసిన చేయి దర్శకుడు త్రివిక్రమ్ ది. అ.ఆ.. అత్తారింటిది దారేదీ, అజ్ఞాతవాసి, జులాయి, జల్సా, సన్నాఫ్ సత్యమూర్తి ఇలా డిఫరెంట్ టైటిళ్లు పెడతారు ఆయన. మరి ఇప్పుడు ఏ టైటిల్ పెట్టబోతున్నారు.

ఇప్పటికే గతంలో రెండు టైటిళ్లు వినిపించాయి. నేను నాన్న.. అలకనంద అంటూ కానీ అవేవీ కాదని తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం బన్నీ-త్రివిక్రమ్ సినిమా టైటల్... వైకుంఠపురంలో... అని వుండబోతోందని తెలుస్తోంది.

లాస్ట్ మినిట్ ఛేంజెస్ చేస్తే తప్ప, అదే ఫిక్స్. హారిక హాసిని పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈ కాంబినేషన్ లో ఇది మూడో సినిమా. మొదటి రెండు సినిమాలకు మంచి పేరే వచ్చింది. ఇది కూడా ఓకె అనిపించుకుంటే హ్యాట్రిక్ కాంబినేషన్ అవుతుంది.

ప్రాంతీయ భాషల సినిమాలు అదుర్స్!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?