Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పరోక్షంగా ఒప్పుకున్నాడు.. టూర్ రద్దు

పరోక్షంగా ఒప్పుకున్నాడు.. టూర్ రద్దు

మన్మథుడు-2 డిజాస్టర్ అంటే నాగార్జున ఒప్పుకోడు. ఇలాంటి కథలు జనాలకు ఎక్కడానికి టైమ్ పడుతుందని, ఇంకొన్నాళ్లు ఓపిక పట్టాలని అంటున్నాడు. గతంలో తను నటించిన గీతాంజలి, నిర్ణయం లాంటి సినిమాల్ని ఉదాహరణలుగా చూపిస్తున్నాడు. కానీ అప్పటి రోజులు వేరు, ఇప్పటి ట్రెండ్ వేరు కదా. మన్మథుడు-2 అట్టర్ ఫ్లాప్ అనే విషయం క్లియర్ గా తెలుస్తూనే ఉంది. నిన్నటి వసూళ్లతో నాగార్జునకు కూడా ఆ విషయం అర్థమైంది.

మన్మథుడు-2 సినిమా వసూళ్లు రెండోరోజు నుంచే పడిపోయాయి. వీకెండ్ లోనే డ్రాప్ అయిన ఈ సినిమా సోమవారం పూర్తిగా చతికిలపడింది. బక్రిద్ హాలిడే ఉన్నప్పటికీ చాలామంది ఈ సినిమాను చూడ్డానికి ఇంట్రెస్ట్ చూపలేదు. దీంతో మన్మథుడు-2 అట్టర్ ఫ్లాప్ అనే విషయాన్ని నాగార్జున కూడా పరోక్షంగా అంగీకరించాడు.

నిజానికి ఈ సినిమాకు సంబంధించి యూనిట్ అంతా టూర్ ప్లాన్ చేసింది. స్వయంగా నాగార్జున కొన్ని ముఖ్య పట్టణాల్లో ప్రచారం చేయాలని అనుకున్నాడు. ఈ మేరకు యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధమైంది. కానీ మన్మథుడు-2 పరిస్థితి రోజురోజుకు దిగజారిపోయింది. భారీ నెగెటివ్ టాక్ తో ఇక ఈ సినిమా కోలుకోవడం కష్టమనే విషయం నాగార్జునకు కూడా అర్థమైపోయింది. అందుకే టూర్ ను రద్దుచేశాడు.

ఏపీ, నైజాంలో ఈ సినిమాను అటుఇటుగా 18 కోట్ల రూపాయలకు అమ్మారు. ఇప్పటివరకు 9 కోట్ల రూపాయల షేర్ మాత్రమే వచ్చింది. బ్రేక్ ఈవెన్ అవ్వడానికి మరో 9 కోట్లు కలెక్ట్ చేయాలి. ఈ టాక్ తో ఈ సినిమా గట్టెక్కడం కష్టమని ఇప్పటికే ట్రేడ్ వర్గాలు తేల్చేశాయి. 

ప్రాంతీయ భాషల సినిమాలు అదుర్స్!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?