ఏంటిది చంద్రబాబు.. ఇంకా ఎన్నాళ్లిలా?

రాజకీయాల్లో తమ తప్పుల్ని కప్పి పుచ్చుకునేందుకు ఎదుటివారి ముఖంపై గుడ్డకాల్చి వేస్తుంటారు. పూర్తి స్థాయిలో విమర్శలకు దిగుతుంటారు. నోరు తెరిస్తే నెగెటివ్ మాటలే. ఇలాంటి బ్లేమ్ గేమ్ ని చాలామంది నమ్ముకుని కాలం నెట్టుకొస్తుంటారు.…

రాజకీయాల్లో తమ తప్పుల్ని కప్పి పుచ్చుకునేందుకు ఎదుటివారి ముఖంపై గుడ్డకాల్చి వేస్తుంటారు. పూర్తి స్థాయిలో విమర్శలకు దిగుతుంటారు. నోరు తెరిస్తే నెగెటివ్ మాటలే. ఇలాంటి బ్లేమ్ గేమ్ ని చాలామంది నమ్ముకుని కాలం నెట్టుకొస్తుంటారు. తన సమర్థత ఏమీ లేకపోతేనే, ఎదుటివారిపై పడి ఏడవడం మొదలవుతుంది.  ప్రస్తుతం చంద్రబాబు కూడా ఇలాంటి బ్లేమ్ గేమ్ కి దిగారు. కేవలం విమర్శలతోనే కాలం నెట్టుకొస్తున్నారు.

నోరుతెరిస్తే అసత్యాలు, అబద్ధపు ప్రచారాలు, అర్థంలేని విమర్శలు.. నేరుగా చాలదన్నట్టు సోషల్ మీడియాలో కల్పిత క్లిప్పింగ్ లతో కాలక్షేపం. ఏది తప్పో, ఏది ఒప్పో కూడా తెలుసుకోలేకుండా చంద్రబాబు, లోకేష్ పూర్తిగా ఇదే పద్ధతిని అవలంబిస్తున్నారు. అసెంబ్లీలో నోరు చేసుకుందామని చూస్తే.. జగన్ సాక్ష్యాధారాలతో చంద్రబాబు పనిపట్టారు. అందుకే సోషల్ మీడియాను వేదిక చేసుకుని చెలరేగిపోతున్నారు. దుమ్మెత్తిపోయడమే పనిగా పెట్టుకున్నారు.

గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు జగన్ ఇలాంటి పనులు చేయలేదు. అదే పనిగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టలేదు. బాబు సంగతి పట్టించుకోనట్టే సైలెంట్ గా ఉన్నారు. ఇలా సైలెంట్ గా ఉండటం కూడా చంద్రబాబుకి అప్పట్లో నచ్చలేదు. ప్రతిపక్షం పాలనకు సహకరించడంలేదంటూ జగన్ పై రకరకాల విమర్శలు చేశారు. కానీ జగన్ మాత్రం తాను ఏం చేయాలనే విషయాలపైనే దృష్టిపెట్టారు. టీడీపీపై విమర్శల డోస్ తగ్గించి తన నవరత్నాల కాన్సెప్ట్ ని పాదయాత్రతో బలంగా జనంలోకి తీసుకెళ్లారు. దాని ఫలితమే 151 సీట్ల భారీ మెజార్టీ.

విజయానికి కావాల్సింది విమర్శలు కాదని చేతల ద్వారా చూపించారు జగన్. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా టీడీపీ గత చరిత్రను పదే పదే తవ్వి తీయకుండా, ఆ పార్టీపై ఎక్కువగా విమర్శలు చేయకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. పోలవరం ప్రాజెక్ట్, మచిలీపట్నం పోర్ట్, అమరావతి.. ఇలా అన్నిటిపైన తన ఆలోచనలను అమలు చేయడమే జగన్ ముందున్న కర్తవ్యం.

ప్రాంతీయ భాషల సినిమాలు అదుర్స్!