టీడీపీని బతికిస్తున్న జగన్!

భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీ ఓ రిక్రూట్ మెంట్ సెల్ గా తయారైంది. టీడీపీ నుంచి ఎవ్వరు వచ్చినా ఎర్ర తివాచి పరిచి మరీ వాళ్లను కమలంలో కలిపేసుకుంటోంది. జిల్లాస్థాయి నుంచి రాష్ట్ర…

భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీ ఓ రిక్రూట్ మెంట్ సెల్ గా తయారైంది. టీడీపీ నుంచి ఎవ్వరు వచ్చినా ఎర్ర తివాచి పరిచి మరీ వాళ్లను కమలంలో కలిపేసుకుంటోంది. జిల్లాస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతినేతకు స్వాగతం పలుకుతోంది. ఇక తెలంగాణలో కేసీఆర్ సంగతి సరేసరి. ఆయన ఇప్పటికే తెలంగాణలో టీడీపీని భూస్థాపితం చేశాడు. కాంగ్రెస్ ను దాదాపు కోలుకోలేని దెబ్బతీశారు. ఇప్పుడు మిగిలిన అరకొర మంది నేతల్ని కూడా బీజేపీ తనవైపు లాగేస్తోంది.

ఈ మొత్తం ప్రహసనంలో నిజాయితీగా, నిక్కచ్చిగా ఉన్నది ఒక్క జగన్ మాత్రమే. నిజానికి జగన్ తలుచుకుంటే ఎమ్మెల్యేల్ని, ఎంపీల్ని, ఇతర నేతల్ని తనవైపు లాక్కోవడం చిటికెలో పని. అప్పట్లో కేసీఆర్, చంద్రబాబు చేసినట్టు జగన్ చేయాలనుకుంటే.. ఇప్పుడు బీజేపీలో చేరడానికి ఒక్క తెలుగుదేశం నేత కూడా మిగలడు. కానీ జగన్ అలా చేయలేదు. ఇదే ఇప్పుడు టీడీపీని బతికిస్తోంది.

తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభాపక్షం ఇప్పటికే బీజేపీలో కలిసిపోయింది. ఇక మిగిలిన గరికపాటి కూడా ఈనెల 18న అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరిపోతున్నారు. రాజ్యసభ సభ్యుల్ని పక్కనపెడితే.. ఇటు లోక్ సభ సభ్యులు కూడా దాదాపు బీజేపీకి దాసోహం అంటున్నారు. ఇక రాష్ట్రస్థాయి నేతల సంగతైతే సరేసరి. పిల్లి మెడలో గంట ఎవరు కడతారా అనే టైపులో అంతా వెయిటింగ్. ఎవరో ఒకరు జంప్ కొడితే, ఆ దారిలో అంతా చేరిపోవడానికి సిద్ధంగా ఉన్నారు.

ఇలామునిగే నావలా తయారైన తెలుగుదేశం పార్టీ అంతో ఇంతో నిబ్బరంగా ఉందంటే దానికి కారణం కేవలం జగన్. పదవులకు రాజీనామా చేయకుండా ఏ ఒక్క ప్రజానాయకుడ్ని చేర్చుకోమని జగన్ ఏకంగా అసెంబ్లీలో విస్పష్టంగా ప్రకటించారు. జగన్ తీసుకున్న ఆ కచ్చితమైన నిర్ణయం చంద్రబాబు పాలిట శ్రీరామరక్షగా మారింది. లేదంటే.. ఈ పాటికి పార్టీలో తనయుడు, బామ్మర్ది మాత్రమే మిగిలేవారు.

ఓవైపు నుంచి బీజేపీ నరుక్కొస్తున్నా, చాపకింద నీరులా చుట్టేస్తున్నా.. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఉన్నంతలో నిబ్బరంగా ఉన్నారంటే దానికి కారణం జగన్ అంటున్నారు విశ్లేషకులు. అలా తెలుగుదేశం పార్టీని జగన్ బతికిస్తున్నారని, లేదంటే ఈ పాటికి ఎప్పుడో ఆ పార్టీ చచ్చిపోయి ఉండేదని… ఇప్పటికే తెలంగాణలో చెల్లాచెదురైన ఆ పార్టీ, ఏపీలో కూడా నామరూపాల్లేకుండా పోయేదని విశ్లేషిస్తున్నారు. 

అలాంటి జిల్లాలోనే తెలుగుదేశం పార్టీ కోటలు కూలిపోయాయి

అడవిశేష్ తో రెజీనా స్పెషల్ చిట్ చాట్