రాక్షసుడుకి ఊపొచ్చింది

బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ కు ఊపిరి ఊదిన సినిమా రాక్షసుడు. అయితే రెండో వీకెండ్ స్టార్ట్ అయిన రోజుకు కాస్త వీక్ అయింది. దాంతో బ్రేక్ ఈవెన్ ఏదైనా సమస్య అవుతుందేమో అనుకున్నారు. కానీ…

బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ కు ఊపిరి ఊదిన సినిమా రాక్షసుడు. అయితే రెండో వీకెండ్ స్టార్ట్ అయిన రోజుకు కాస్త వీక్ అయింది. దాంతో బ్రేక్ ఈవెన్ ఏదైనా సమస్య అవుతుందేమో అనుకున్నారు. కానీ నాగ్ నటించిన మన్మధుడు 2 సినిమా డిజాస్టర్ కావడంతో సీన్ మొత్తం మారిపోయింది.

సెకెండ్ వీకెండ్ రాక్షసుడుకి ఫుల్ హ్యాపీ అయిపోయింది. వైజాగ్ కోటి రూపాయలు కట్టి, యాభై లక్షలు అడిషనల్ గ్యారంటీ అన్నారు. అలాంటిది ఇప్పటికే కోటిన్నర షేర్ దాటేసింది. రెండు కోట్లు కనీసం వస్తుందని బయ్యర్ ధీమాగా వున్నారు. సెకెండ్ వీకెండ్ లో నలభై లక్షలు వసూలు చేయడం విశేషం.

రాక్షసుడు దాదాపు అన్నిచోట్లా షేర్ వసూలు చేస్తోంది. ఇదే పరిస్థితి దాదాపు అన్ని ఏరియాల్లో వుంది. చిత్రంగా రాక్షసుడు రేంజ్ లో కాకున్నా, గుణ 369 కూడా ఇంకా చాలాచోట్ల ఎంతోకొంత షేర్ లాగుతోంది. ఇదిలావుంటే రాక్షసుడు విజయం ఇచ్చిన ఉత్సాహంతో నిర్మాత కొనేరు సత్యనారాయణ అర్జెంట్ గా తమిళనాడు సినిమాల మీద కన్నేసారు. సరైన సినిమా దొరికితే అర్జెంట్ గా కొని రీమేక్ చేసే ఆలోచనలో బిజీగా వున్నారు.

అలాంటి జిల్లాలోనే తెలుగుదేశం పార్టీ కోటలు కూలిపోయాయి

అడవిశేష్ తో రెజీనా స్పెషల్ చిట్ చాట్