ఆర్ క్రిష్ణయ్య ఉక్కు పాదం…ఏం చెబుతారో…?

తెలంగాణాకు చెందిన ఆర్ క్రిష్ణయ్య బీసీ నేత కోటాలో ఏపీలో వైసీపీ సర్కార్ తరఫున రాజ్యసభ సభ్యుడు అయ్యారు. దాంతో ఆయన రాజకీయ, సామాజిక కార్యక్షేత్రంగా ఏపీ అవుతుంది అని అంటున్నారు. ఆయన ఇక…

తెలంగాణాకు చెందిన ఆర్ క్రిష్ణయ్య బీసీ నేత కోటాలో ఏపీలో వైసీపీ సర్కార్ తరఫున రాజ్యసభ సభ్యుడు అయ్యారు. దాంతో ఆయన రాజకీయ, సామాజిక కార్యక్షేత్రంగా ఏపీ అవుతుంది అని అంటున్నారు. ఆయన ఇక మీద ఎక్కువ కాలం ఏపీలో గడుపుతారు అని చెబుతున్నారు.

ఇక ఎంపీగా ఏకగ్రీవంగా నెగ్గిన క్రిష్ణయ్య తొలి పాదం విశాఖ ఉక్కు కర్మాగారంలోనే మోపనున్నారు. ఆయన ఈ నెల 29న విశాఖ ఉక్కుని సందర్శించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కి చెందిన ఓబీసీ బృందం విజయవాడ వెళ్ళి మరీ క్రిష్ణయ్యను కలసింది. స్టీల్ ప్లాంట్ సందర్శించాలని కోరింది.

ఇక విశాఖ ఉక్కు మీద కేంద్రం వేటు వేసేందుకు సిద్ధంగా ఉంది. విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయడానికి రంగం సిద్ధం అవుతోంది. ఈ నేపధ్యంలో ఆర్ క్రిష్ణయ్య విశాఖ ఉక్కు కర్మాగారం వస్తున్నారు అంటే ఆయన ఏం చెబుతారో అన్న ఆసక్తి అందరిలో కలుగుతోంది. అదే టైమ్ లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నాలుగు వందల రోజులకు పైగా కార్మికులు ఆందోళన బాటలో ఉన్నారు. 

ఉక్కు ప్రైవేట్ ప‌రం అయితే కచ్చితంగా బీసీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో నష్టపోతారు. ఇక క్రిష్ణయ్య బీసీ ఉద్యోగుల తరఫున తన గళాన్ని విప్పి మోడీ సర్కార్ కి ప్రైవేట్ విషయంలో ఏమైనా హెచ్చరికలు జారీ చేస్తారా అన్నది చూడలి.