భూమ‌న చొర‌వ‌.. గ‌రుడవార‌ధి ప‌నుల‌కు మోక్షం

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం రావ‌డం, గ‌త ప్రభుత్వం అవినీతికి పాల్పడింద‌నే కార‌ణంతో  కొన్ని నిర్మాణాలు ఆగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తిరుప‌తి ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి చొర‌వ‌తో తిరుప‌తిలో ఆగిన గ‌రుడ‌వార‌ధి ప‌నులు పునఃప్రారంభ‌మ‌య్యాయి. ఇది…

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం రావ‌డం, గ‌త ప్రభుత్వం అవినీతికి పాల్పడింద‌నే కార‌ణంతో  కొన్ని నిర్మాణాలు ఆగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తిరుప‌తి ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి చొర‌వ‌తో తిరుప‌తిలో ఆగిన గ‌రుడ‌వార‌ధి ప‌నులు పునఃప్రారంభ‌మ‌య్యాయి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజ‌లంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. రాష్ర్టంలో రెండునెల‌ల క్రితం వైఎస్ జ‌గ‌న్ అధికార ప‌గ్గాలు చేప‌ట్టారు. చంద్రబాబు హ‌యాంలో చోటు చేసుకున్న అవినీతిపై ఆయ‌న త‌న‌దైన శైలిలో కొర‌డా ఝులిపిస్తున్నారు.

ఇందులో భాగంగా వివిధ ప్రాజెక్టుల కింద చేప‌ట్టిన నిర్మాణాల్లో 25 శాతం పూర్తికాని వాటిని ర‌ద్దు చేయ‌డంతో పాటు కొన్నింటిని నిలిపి వేస్తూ జ‌గ‌న్ స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకొంది. ఈ నేప‌థ్యంలో రాష్ర్ట వ్యాప్తంగా స్మార్ట్‌సిటీల‌కు చెందిన 30 ప‌నులు కూడా నిలిచిపోయాయి. ప్రధానంగా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుప‌తిలో రూ.684 కోట్ల‌తో చేప‌ట్టిన స్మార్ట్ ఎలివేటెడ్ కారిడార్ (గ‌రుడ వార‌ధి) నిర్మాణం కూడా ఉంది. ల‌క్ష‌లాది మంది భ‌క్తులు, న‌గ‌ర వాసుల  ఇబ్బందుల‌ను స్థానిక ఎమ్మెల్యే భూమ‌న ప‌సిగ‌ట్టారు.

ఈ స‌మ‌స్యకు స‌త్వర ప‌రిష్కారం క‌నుగొనే ఆశ‌యంతో వెంట‌నే సంబంధిత మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ దృష్టికి తీసుకెళ్లారు. భూమ‌న అంత‌టితో త‌న బాధ్యత నెర‌వేరింద‌ని ఊరుకో లేదు. త్రిమెన్ క‌మిటీని వేయించారు. స‌మ‌స్యకు స‌త్వర ప‌రిష్కారం తీసుకురావ‌డంతో పాటు భక్తుల‌కు, న‌గ‌ర‌వాసుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కూడ‌ద‌నే ఎమ్మెల్యే త‌ప‌న‌ను గుర్తించిన త్రిమెన్ కమిటీ స‌భ్యులు గ‌త గురు, శుక్రవారాల్లో ప‌నుల‌ను ప‌రిశీలించారు. ఎమ్మెల్యే ఆలోచ‌న‌లు, అభిప్రాయాల‌కు అనుగుణంగా గ‌రుడ వార‌ధి ప‌నుల‌కు గ్రీస్ సిగ్నల్ ఇస్తూ త్రిమెన్ క‌మిటీ యుద్ధ ప్రాతిప‌దిక‌న ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.

ప్రభుత్వానికి శుక్రవారం నివేదిక ఇవ్వడం, శ‌నివారం ప‌నుల పునఃప్రారంభానికి శ్రీ‌కారం చుట్టడం చ‌కాచ‌కా జ‌రిగిపోయాయి. ఈ ప‌నుల‌కు సంబంధించి ఎమ్మెల్యే భూమ‌న‌తో పాటు తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తిరుప‌తి న‌గ‌ర‌పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ గిరీష్ భూమిపూజ చేశారు. 2006లో గ‌రుడ ప‌నుల‌కు వైఎస్ హ‌యాంలో ప్రతిపాద‌న‌లు సిద్ధం చేశార‌ని, అది కార్యరూపం చెంద‌డానికి ఇంత‌కాలం ప‌ట్టింద‌ని ఎమ్మెల్యే గుర్తుచేశారు.

ఏది ఏమైనా ఆఫ్కాన్ సంస్థ గ‌రుడ వార‌ధి ప‌నుల‌ను ఎలాంటి ఆటంకం లేకుండా చేప‌ట్టేందుకు మార్గం సుగుమం చేసిన భూమ‌న చొర‌వ‌ను న‌గ‌ర‌వాసులు, భ‌క్తులు ప్రశంసిస్తున్నారు. అదీ క‌లియుగ దైవం శ్రీ‌వేంక‌టేశ్వరుని స‌న్నిధికి సంబంధించి కావ‌డంతో జ‌గ‌న్ స‌ర్కార్‌కు రానున్న రోజులు అన్నీ మంచివ‌నే సందేశాన్ని, సంకేతాన్ని ఇచ్చిన‌ట్టైంద‌ని భూమ‌న అంటున్నారు.

అలాంటి జిల్లాలోనే తెలుగుదేశం పార్టీ కోటలు కూలిపోయాయి

అడవిశేష్ తో రెజీనా స్పెషల్ చిట్ చాట్