ప్రేమ లో పడితే అంతే… ప్రియుడికి దగ్గరగా వుండాలనిపిస్తుంది. మిగిలిన విషయాలు అన్నీ బలాదూర్ అనిపిస్తాయి. రెక్కలు కట్టుకుని ప్రియుడి దగ్గర వాలిపోవాలి అనిపిస్తుంది. పైగా కాస్త ఖాళీ వుంటే ఇక చెప్పనక్కరలేదు.
ఓ హీరోయిన్ ముచ్చటే ఇది. ఓ యంగ్ హీరో, ఓ యంగ్ హీరోయిన్ ప్రేమలో పడ్డారు. ఇండస్ట్రీ అంతా ఆ విషయం గుసగుస లాడుకుంది. అలా అని చెప్పి ఆ ఇద్దరూ కూడా ఖండంచలేదు. కాలం అలా సాగుతూనే వుంది.
ఇటీవల ఆ హీరో విదేశాల్లో షూటింగ్ కు వెళ్లిపోయాడు. వెంటనే వేరుగా, నేరుగా ఈ అమ్మడు కూడా అక్కడకు చేరిపోయినట్లు తెలుస్తోంది. అయితే అలా వెళ్లినట్లు ప్రూఫ్ లు గట్రా తెమ్మంటే తేలేరు కానీ, సోషల్ మీడియాలో ప్రయాణం పోస్ట్ లు, విదేశీ సమయాల్లో కాఫీ తాగుతున్న పోస్ట్ లు చూస్తుంటే అర్థమైపోతోంది అమ్మడు ఎక్కడ వుంది అన్న విషయం.
ఇద్దరు మరీ టీన్స్ లో లేరు. పెళ్లి వయసు రావడమే కాదు దాటిపోయేలా వుంది. అందువల్ల త్వరగా పెళ్లి బాజాలు మోగించేస్తే ఇలా చాటు మాటు సరసాలు అవసరం లేదేమో?