ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలీవాల్ సంచాలన వ్యాఖ్యలు చేశారు. తనకు అత్యాచార బెదిరింపులు వస్తున్నాయని చెప్పారు. తనపై అత్యాచార బెదిరింపులు చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని ఆమె పోలీసులను కోరారు. తనపై బెదిరింపులు పాల్పడుతున్న వారి వెనుక ఎవరూ ఉన్నారనేది దర్యాప్తు చేయలని పోలీసులను కోరారు.
వివాదాస్పద బాలీవుడ్ నిర్మాత సాజిద్ ఖాన్ ను బిగ్ బాస్ లోకి తీసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఆమె సాజిద్ ను షో నుండి తీసివేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ లేఖ రాయడంతో బెదిరింపులు వస్తున్నాయి అంటూ వాపోతున్నారు.
దేశంలో మీటూ ఉద్యమం సమయంలో సాజిద్ పై పలువురు మహిళలు లైంగిక ఆరోపణలు చేశారు. దీంతో ఆయన్ను 2018లో ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ డైరెక్టర్ అసోసియేషన్ నుండి ఏడాది పాటు సస్పెండ్ చేశారు. కానీ ఇప్పుడు అలాంటి వ్యక్తిని బిగ్ బాస్ షో తీసుకోవడంతో ఢిల్లీ మహిళ కమిషన్ అయిన స్వాతి మాలీవాల్ నిర్మాత సాజిద్ ఖాన్ ను తీసివేయాలని డిమాండ్ చేస్తూ ఇటీవలే కేంద్రమంత్రికి లేఖ రాశారు.