చిరంజీవి కెరీర్ లో కలకత్తా బ్యాక్ డ్రాప్ అంటే ఎవరికైనా చూడాలని ఉంది సినిమానే గుర్తొస్తుంది. కలకత్తాను తలపించేలా ఆ సినిమా కోసం వేసిన సెట్లు ఇప్పటికీ అందరికీ గుర్తే. ఇప్పుడు చిరు కెరీర్ లో మరో కలకత్తా బ్యాక్ డ్రాప్ మూవీ రెడీ అవుతోంది. దీని పేరు భోళా శంకర్.
ఈరోజు చిరంజీవి, మెహర్ రమేష్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా టైటిల్ ను రివీల్ చేశారు. ఈ మూవీకి భోళాశంకర్ అనే టైటిల్ పెట్టినట్టు గతంలోనే గ్రేట్ ఆంధ్ర వెల్లడించింది. ఇప్పుడు అదే టైటిల్ ను ప్రకటిస్తూ, చిరు బర్త్ డే సందర్భంగా మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. తమిళ్ లో హిట్టయిన వేదాళం సినిమాకు రీమేక్ గా వస్తోంది భోళాశంకర్. మోషన్ పోస్టర్ లో కోల్ కతా బ్రిడ్జ్ చూపించారు.
ఇక ఇదే మూవీ నుంచి మరో అప్ డేట్ కూడా వచ్చేసింది. ఈ సినిమాలో చిరంజీవికి చెల్లెలిగా కీర్తిసురేష్ ను తీసుకున్నారనే విషయం తెలిసిందే. ఆ అప్ డేట్ కూడా వచ్చేసింది. ఈరోజు చిరు బర్త్ డే మాత్రమే కాదు, రాఖీ పండగ కూడా. అందుకే కీర్తిసురేష్ మేటర్ ను కూడా ఇదే రోజు రివీల్ చేశారు. చిరంజీవికి కీర్తిసురేష్ రాఖీ కడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
మొత్తమ్మీద చిరు-మెహర్ ప్రాజెక్టుకు సంబంధించి ఇంతకుముందే చెప్పినట్టు 2 అప్ డేట్స్ వచ్చేశాయి. ఇక మిగిలింది గుండు అప్ డేట్ మాత్రమే. ఈ సినిమాలో చిరంజీవి ఓ షేడ్ లో గుండుతో కనిపించబోతున్నారు. దానికి సంబంధించి ఆమధ్య లుక్ టెస్ట్ కూడా జరిగింది. మరి ఆ మేటర్ ఎప్పుడు రివీల్ చేస్తారో చూడాలి.