జ‌గ‌న‌న్న సంతోషం కోసం అంటున్న ష‌ర్మిల!

నేడు దేశ‌మంతా రాఖీ పండుగ సంబ‌రాల‌ను జ‌రుపుకుంటున్నారు. అన్నాచెల్లెళ్లు, అక్కాత‌మ్ముళ్లు ప‌ర‌స్ప‌రం త‌మ ప్రేమానుబంధాల‌ను గుర్తు చేసుకుంటూ… శుభాకాంక్ష‌లు చెప్పుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఏపీ సీఎం జ‌గ‌న్‌కు ఆయ‌న ముద్దుల చెల్లి ష‌ర్మిల శుభాకాంక్ష‌లు…

నేడు దేశ‌మంతా రాఖీ పండుగ సంబ‌రాల‌ను జ‌రుపుకుంటున్నారు. అన్నాచెల్లెళ్లు, అక్కాత‌మ్ముళ్లు ప‌ర‌స్ప‌రం త‌మ ప్రేమానుబంధాల‌ను గుర్తు చేసుకుంటూ… శుభాకాంక్ష‌లు చెప్పుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఏపీ సీఎం జ‌గ‌న్‌కు ఆయ‌న ముద్దుల చెల్లి ష‌ర్మిల శుభాకాంక్ష‌లు చెప్ప‌డం ఎంతో ప్ర‌త్యేకంగా భావించాలి.

ఎందుకంటే ఇద్ద‌రి మ‌ధ్య రాజ‌కీయ భిన్నాభిప్రాయాల నేప‌థ్యంలో అన్న వ‌ద్దంటున్నా… తెలంగాణ‌లో ష‌ర్మిల సొంత పార్టీ పెట్టుకున్న వైనం గురించి అంద‌రికీ తెలిసిందే. ఇద్ద‌రి మ‌ధ్య మాట‌లు కూడా లేవ‌నే ప్ర‌చారం జ‌రుగుతున్న ప‌రిస్థితుల్లో జ‌గ‌న్‌కు షర్మిల రాఖీ శుభాకాంక్ష‌లు చెప్ప‌డంపై సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌కు దారి తీసింది.

ఇదే సంద‌ర్భంగా ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ రాఖీ పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్ష‌లు చెప్ప‌డం గ‌మనార్హం. తోబుట్టువుల మధ్య ఉన్న ప్రేమానురాగాలకు, జీవితాంతం ఒకరికొకరం తోడుగా ఉంటామనే హామీకి రక్షాబంధన్‌ ప్రతీకగా నిలుస్తుందని జ‌గ‌న్ అన్నారు. రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా రాఖీ పండుగ జరుపుకోవాలని సీఎం జగన్‌ ఆకాంక్షించారు.

ఇక ష‌ర్మిల విష‌యానికి వ‌స్తే… ప్ర‌త్యేకంగా త‌న అన్న పేరును ట్వీట్‌లో ప్ర‌స్తావించారు.

“నా తోడబుట్టిన జగనన్నకు మరియు నేను నమ్మిన సిద్ధాంతం కోసం నాకు అండగా నిలిచిన, నేనెంచుకున్న మార్గంలో నాతో కలిసి నడుస్తున్న, నా ఆశయ సాధనలో నన్ను నిలబెడుతున్న ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి సుఖ సంతోషాలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి సోదరి షర్మిల” అని ట్వీట్ చేశారు. రాఖీ శుభాకాంక్ష‌ల‌లో అన్నాచెల్లెళ్ల మ‌ధ్య ఉన్న చిన్న తేడాను గ‌మ‌నించొచ్చు.