కేఏ పాల్ కు ఉన్న ధైర్యం కూడా చంద్రబాబు నాయుడు తన స్నేహితుడు పవన్ కళ్యాణ్ కు లేకుండా పోతుందా? అంటే నిజం అనిపిస్తుంది. పేరుకు జాతీయ పార్టీ అని చెప్పుకుంటూన్న టిడిపి కనీసం తెలంగాణలో జరుగబోతున్న ఉప ఎన్నికల్లో అభ్యర్థిని కూడా ఇంకా చంద్రబాబు నాయుడు ప్రకటించడం లేదంటే చంద్రబాబులో భయం కనపడుతోంది.
టిడిపి నిలబెట్టలేదు. కనీసం తన శిష్యుడు అయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఎటూ తెల్చడం లేదు. కనీసం నేను అభ్యర్ధిని నిలబెట్టను బీజేపీకి నా సపోర్టు చేస్తా, లేకపోతే టీఆర్ఎస్ కు సపోర్టు చేస్తా అంటే ఎవరూ అడగరు. లేకపోతే వైసీపీ చెప్పినట్లు మేము ఆంధ్ర రాజకీయాల వరకే పరిమితం అంటే టిడిపి-జనసేను ఎవరూ ప్రశ్నించారు కదా.
కానీ రిసెంట్ గా పవన్ కళ్యాణ్ తెలంగాణ పార్టీ నాయకులతో సమావేశాలు అవ్వుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తమ పార్టీ గట్టి పోటీ ఇస్తుందంటూన్నా పవన్ ఎందుకు మునుగోడు ఎన్నికల్లో సైలెంట్ గా ఉంటున్నారు. బిజెపిపై కొపమా లేక కేసీఆర్ అంటే భయమా. అలాగే టిడిపి అధినేత ఇటీవల ఖమ్మం పర్యటనలో టిడిపి తెలంగాణలో అధికారంలోకి తెస్తాం అన్నారు తీరా ఎన్నికల టైంలో సైలెంట్ గా ఉంటున్నారు. కనీసం షర్మిలా పార్టీ లాగా తమది కొత్త పార్టి ఇంక సరైన క్యాడర్ లేదు కాబట్టి ఎన్నికలకు దూరంగా ఉంటునాం అని చెప్పాచ్చు. ఎంతో అనుభవం ఉన్నా పార్టీలు కూడా సైలెంట్ ఉండటం ఏమిటి
తన పార్టీ కనీసం నోటాకు వచ్చిన ఓట్ల కంటే ఎక్కువో, తక్కువో వస్తాయి అని అనుకుని కేఏ పాల్ తన పార్టీ అభ్యర్ధిని ప్రకటించి ఎన్నికల రణరంగంలోకి దిగారు. ఎంత సేపు ట్వీట్టర్ లో నోటికి వచ్చినట్లు ఎవరో రాసినవి రాస్తూ ఉంటేనే రాజకీయం అనుకుంటే జనసేన పార్టి ఇంకో 40 సంవత్సారాలు అయిన పవన్ కళ్యాణ్ కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవడం కష్టం అంటూన్నారు రాజకీయ విశ్లేషకులు. చంద్రబాబు కూడా పార్టీ అభ్యర్ధి ప్రకటించకపోతే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఎక్కడ కూడా డిపాజిట్లు కూడా రావడం కష్టం అంటూన్నారు.