విశాఖ నగరం దూసుకుపోతోంది. అవార్డులతోనూ ర్యాంకులతోనూ చాలా ముందుకు పోతోంది. జాతీయ స్థాయిలో ఇచ్చే ప్రతీ అవార్డూ విశాఖను దాటిపోవడం లేదు. తాజాగా విశాఖ మధ్యప్రదేశ్ లోని ఇండోర్ తో పోటీ పడి మరీ ధీటైన అవార్డుని సాధించింది.
తాజాగా మహా విశాఖ నగర పాలక సంస్థకు ప్రతిష్టాత్మకమైన వాటర్ ప్లస్ సర్టిఫికేట్ లభించింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్చభారత్ కార్యక్రమాలలో జాతీయ స్థాయిలో ఇప్పటికే జీవీఎంసీ అనేక అవార్డులు గెలుచుకుంది.
తాజాగా వాటర్ ప్లస్ సర్టిఫికేట్ వంటి అవార్డులతో దేశంలోనే విశాఖ వైపు చూసేలా చేసినట్లు అయింది. విశాఖలో సామాజిక మరుగుదోడ్లు, బహిరంగ ప్రదేశాలను, మురుగునీటి శుద్ధి కేంద్రాలను పరిశీలించిన కేంద్ర బృందం ఈ మేరకు విశాఖకు ఈ సర్టిఫికేట్ ప్రదానం చేశారని కమిషనర్ జి సృజన తెలియచేశారు.
విశాఖ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థకు కూడా ప్రశంసలు దక్కాయని ఆమె పేర్కొంటున్నారు. మొత్తానికి మరిన్ని అవార్డులు ఈ నగరానికి రావాలని, వస్తాయని నగర వాసులు ఆశిస్తున్నారు.