అసత్య పత్రిక కూసిన సరికొత్త అబద్ధపు కూత

జీవితంలో అబద్ధమాడనివారు దాదాపు ఉండరు. సత్య హరిశ్చంద్రుడు, బలి చక్రవర్తి, ధర్మరాజు లాంటి సత్యవాదుల కథలు ఎన్ని చదివినా వారిలాగ జీవితాన్ని మలచుకునే ప్రయత్నం చేసేవారు మనతో పాటూ మన చుట్టూ కూడా ఆల్మోస్ట్…

జీవితంలో అబద్ధమాడనివారు దాదాపు ఉండరు. సత్య హరిశ్చంద్రుడు, బలి చక్రవర్తి, ధర్మరాజు లాంటి సత్యవాదుల కథలు ఎన్ని చదివినా వారిలాగ జీవితాన్ని మలచుకునే ప్రయత్నం చేసేవారు మనతో పాటూ మన చుట్టూ కూడా ఆల్మోస్ట్ కనపడరు.

జీవితంలో కొన్ని ప్రమాదాలనుంచి తప్పించుకోవడానికి వేరే మార్గం లేక అబద్ధాలాడడం సహజం. కానీ అబద్ధాలే వ్యాపారంగా, వ్యాపారాన్నే ఒక అబద్ధంగా, అబద్ధాలమ్మడమే నిత్యకృత్యంగా, అబద్ధమే జీవితపరమావధిగా బతుకుతున్న వార్తాసంస్థ ఒకటుంది.

చంద్రజ్యోతిగా మారుపేరుతో అభివర్ణించబడే ఆ పత్రిక తన కొంగుచాటు పార్టీని, ఆ పార్టీతో స్నేహం చేసే పార్టీలని తప్ప మిగతా వారందరి మీద అసత్యాస్త్రం సందిస్తూనే ఉంటుంది.

మరీ ముఖ్యంగా ప్రస్తుతం ఆ.ప్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీ అంటే ఆ పత్రికకి ఆజన్మశతృత్వం. ఆ పార్టీపై ఎన్నో అబద్ధాలు రాస్తూ, జనం నమ్ముతున్నారనే భ్రమలో బతుకుతూ ఒకానొక పైశాచిక ఆనందం పొందే పత్రిక ఏదైనా ఉందా అంటే అది ఇదే.

కానీ ఏం లాభం…ఎన్ని రాసినా జనం చాచి కొట్టినట్టు 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ, ఆ తర్వాత జరిగిన పంచాయతీ, కార్పోరేషన్, జెడ్పీటీసీ, నిన్నగాక మొన్న జరిగిన తిరుపతి ఉప ఎన్నికల్లోనూ ప్రభుత్వం నడిపే పార్టీకే సింహాసనం వేసి కూర్చోబెట్టారు.

అయినా ఓండ్ర పెట్టే గాడిద తన జన్మలో గర్జించలేదన్నట్టుగా అసత్య ప్రేలాపలనలను రాయడం మాత్రం ఆపట్లేదు. తల బొప్పి కట్టినా, మాడు పగిలినా బుద్ధి మార్చుకోవట్లేదు. అవే రాతలు, అవే కూతలు.

తాజాగా కొత్త కూత ఏంటంటే ప్రదానమంత్రి నరేంద్ర మోదీ ఆ.ప్ర ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డిని అప్పులు చెయొద్దని మందలించారని ఒక పేక మేడ కట్టారు. అన్ని రాష్ట్రాలు ఇలాగే అప్పులు చేసుకుంటూ పోతే దేశం కుప్పకూలడం ఖాయమన్నారని ఒక వార్త వండారు. ఆ.ప్ర కి కొత్త అప్పులకి అనుమతి ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేసారని మరొక ఈక తగిలించారు. ఇకపై జీతాలో, పథకాలో తేల్చుకోవాల్సిన దుస్థితి దాపురించిందని ఆ కథనం.

అసలు బుర్రలో పది గ్రాముల మెదడున్నా ఒక విషయం అర్థం కావాలి. ప్రధాని ఇలా మండిపడితే ముందుగా వార్త కవరయ్యేది నేషనల్ మీడియాలో. ఈ వార్త బూతద్దం వేసుకుని వెతికినా ఒక్క ప్రధాన నేషనల్ చానల్లో కూడా ప్రసారం కాలేదు. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫోటో కూడా వేసి ఆవిడ కూడా ఏదో స్టేట్ మెంట్ ఇచ్చినట్టు రాసారు. కనీసం అది కూడా ఇంకెక్కడా కవర్ కాలేదు.

మరి ఈ వార్త ఒక్క చంద్రజ్యోతికే ఎలా తెలిసింది? ప్రధాని చెవిలో చెప్పారా? ఇలాంటి మందలింపులు నాలుగ్గోడల మధ్యా చెయ్యరు కదా. మీడియా ముఖంగా చేస్తారు కదా.

అయినా వంద లక్షల కోట్ల అప్పు చేసిన నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆ.ప్ర ప్రభుత్వం అప్పుల గురించి మాట్లాడుతుందా? అసలేమన్నా అర్థం ఉందా? అయినా అప్పులనేవి అర్హతని బట్టే పుడతాయి. అడిగినంత ఏ రాష్ట్రానికీ ఏ వ్యవస్థా ఇవ్వదు. అప్పు పుట్టించుకోవడం రాష్ట్రాన్ని, దేశాన్ని నడపడం అనేది సర్వసాధారణం. ఒకవేళ నిజంగా ప్రమాదం దాపురిస్తే బహిరంగంగా ప్రజలకి తెలిసేలా విషయాన్ని వెల్లడిస్తారు తప్ప ఇలా ఎవ్వరికీ తెలియకుండా కేవలం చంద్రజ్యోతికి మాత్రమే తెలిసేలా కాదు.

ఇంతకీ ఆ పచ్చరాతలో మర్మం ఏమిటంటే ప్రజల్ని భయభ్రాంతుల్ని చేయడం. జీతాలో, పథకాలో తేల్చుకోవాలంటే..ఇక పథకాలు నడిపే డబ్బులు రాష్ట్ర ఖజానాలోకి రావట్లేదహో ..అని గోబెల్స్ ప్రచారం చేయడం.

20 వ తారీకున మొదలైన ఈ ప్రచార పర్వం సెప్టంబర్ 1 దాకా సాగుతుంది. పథకాల సొమ్ము, జీతాలు అందాల్సిన వారికి అందగానే సైలెంటవుతుంది. మళ్లీ సెప్టెంబర్ నెలాఖరున మొదలుపెడుతుంది ఇదే ప్రచారం…అలా ఒక నిత్య ధారావాహిక లాగ ఈ డ్రామా రాతలు రాసుకుంటూ ఉంటుంది. జనం కూడా ఎప్పటిలాగానే లైట్ తీసుకుంటారు. అలా ఈ సీరియల్ కూడా ఫ్లాపవుతుంది.

అప్పులు ఎక్కువగా చేస్తున్న రాష్ట్రాల జాబితాలో ఆ.ప్ర కంటే పైన తెలంగాణా, మహారాష్ట్ర, తమిళనాడులు ఉన్నాయి. మరి ఈ పత్రిక తెలంగాణా అప్పుల గురించి రాయదే? కారణం అందరికీ తెలుసు. తెలంగాణా ప్రభుత్వాన్ని నడిపే పార్టీ పేరు చెబితే ఈ పత్రికకి చెమట్లు పడతాయి, ప్యాంటు కూడా తడుస్తుంది.

తాను కొమ్ముకాస్తున్న పార్టీ యొక్క ప్రత్యర్థిని దెబ్బ తీస్తున్నాను అనే భ్రమలో ఈ పత్రిక తన వెనుకున్న పార్టీకే మరింత లోతుగా గొయ్యి తవ్వుకుంటూ పోతోంది. ఈ సత్యాన్ని ఆ అసత్యపత్రిక ఎప్పుడు తెలుసుకుంటుందో!