క్యారెక్టర్ కు తగినట్లు తనను తాను మార్చుకోవడం, గెటప్, స్టైల్ డిజైన్ చేసుకోవడం కోసం అల్లు అర్జున్ చాలా కష్టపడతాడు. కిందా మీదా అవుతాడు. అందుకే ఎక్కడి నుంచో ఇక్కడి వరకు తనను తాను మార్చుకుంటూ వచ్చాడు.
లేటెస్ట్ గా పుష్ప సినిమాలో బన్నీని చూసిన వారంతా వావ్ అంటున్నారు. ఆ మధ్య విడుదల చేసిన పాటలో బన్నీని చూసి అతని ట్రాన్సాఫర్మేషన్ సూపర్ అంటున్నారు.
ఇంతకీ విషయం ఏమిటంటే ఇలా కనిపించడానికి బన్నీకి రెండు గంటలకు పైగానే పడుతోందంట. తన కలర్ మార్చుకోవడానికి బాడీ మీద, మొహం మీద ఎక్కడిక్కడ కంటిన్యూటీ చెడకుండా స్పాట్స్ తో సహా చూసుకోవడానికి అన్నీ కలిపి రెండు గంటలకు పైగా ఓపిగ్గా మేకప్ చేయించుకోవాల్సి వస్తోందట.
రెండు గంటలకు పైగా మేకప్ టీమ్ ముందు ఓపిగ్గా కూర్చుంటే కానీ పుష్పరాజ్ గెటప్ లో బన్నీ మారడం సాధ్యం కావడం లేదట. బన్నీ డెడికేషన్ చూసి యూనిట్ జనాలు ఆ వ్యవహారం కథలు కథలుగా చెప్పుకుంటున్నారు.