వీరయ్య-మెగా ఫొటో షూట్

మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా కంటెంట్ మీద కంటెంట్..అప్ డేట్ ల మీద అప్ డేట్లు వస్తున్నాయి.  Advertisement ఇప్పటికే మైత్రీమూవీస్-బాబీ కాంబినేషన్ లో నిర్మించే సినిమాకు సంబందించి రేపు లుక్ వదలబోతున్నట్లు ప్రకటన…

మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా కంటెంట్ మీద కంటెంట్..అప్ డేట్ ల మీద అప్ డేట్లు వస్తున్నాయి. 

ఇప్పటికే మైత్రీమూవీస్-బాబీ కాంబినేషన్ లో నిర్మించే సినిమాకు సంబందించి రేపు లుక్ వదలబోతున్నట్లు ప్రకటన వెలువడింది. ఈ లుక్ కోసం కొద్ది రోజుల క్రితమే ప్రత్యేకంగా ఫొటో షూట్ చేసారు. ఈ ఫొటోనే రేపు వదలబోతున్నట్లు తెలుస్తోంది.

లూసిఫర్ రీమేక్ అయిన గాడ్ ఫాదర్ నుంచి మోషన్ పోస్టర్ వచ్చింది. ఇది మాత్రం ఏమంత ఆకట్టుకునేలా, ఎగ్జయింట్ మెంట్ తో లేదు. ఆ గెటప్ ఏదో డిటెక్టివ్ గెటప్ లా వుంది తప్ప, లూసిఫర్ లో మోహన్ లాల్ ను గుర్తు చేయలేదు. పైగా ఆ టోపీ చూడగానే ప్రభాస్ గుర్తు వస్తాడు సినిమా జనాలకు. 

ఇక ఈ రెండూ అలా వుంచితే వేదాలం రీమేక్ అయిన భోళాశంకర్ నుంచి ఏం విడుదల చేస్తారో చూడాల్సి వుంది.