చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమా అప్ డేట్స్ ను బ్యాక్ టు బ్యాక్ అందించబోతున్నారు. ఎన్నడూలేని విధంగా చిరు చేతిలో ఆచార్యతో కలిపి 4 సినిమాలున్నాయి. ఈ 4 సినిమాలకు సంబంధించిన విశేషాల్ని ఈరోజు సాయంత్రం నుంచి రేపటి వరకు విడతల వారీగా అందించబోతున్నారు.
ఆచార్య సినిమా నుంచి ఇప్పటికే చిరంజీవి బర్త్ డే పోస్టర్ రిలీజైంది. రేపు ఈ సినిమా నుంచి చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మరో సర్ ప్రైజ్ ను రివీల్ చేయబోతున్నారు. అదేంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్. చిరంజీవి కెరీర్ లో 152వ సినిమా ఇది.
ఇక ఈరోజు సాయంత్రం చిరంజీవి-మోహన్ రాజా కాంబినేషన్ లో వస్తున్న లూసిఫర్ రీమేక్ కు సంబంధించి అప్ డేట్ విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాకు గాడ్ ఫాదర్ అనే టైటిల్ ను అనుకుంటున్నారు. అదే విషయాన్ని బయటపెడతారా లేక చిరంజీవి కొత్త లుక్ తో పోస్టర్ రిలీజ్ చేస్తారా అనేది చూడాలి.
ఇక చిరంజీవి-మెహర్ రమేష్ మూవీకి సంబంధించి ఓ హాట్ హాట్ అప్ డేట్ రెడీ అయింది. రేపు ఉదయం 9 గంటలకు ఈ అప్ డేట్ రాబోతోంది. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్లపై ఈ సినిమా వస్తోంది. వేదాళం సినిమాకు రీమేక్ ఇది.
ఇక రేపు సాయంత్రం చిరంజీవి-బాబి సినిమా నుంచి అప్ డేట్ వస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన వివరాల్ని రేపు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు బయటపెట్టబోతున్నారు. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. ఇలా ఈసారి చిరు పుట్టినరోజు నాడు సినిమాల సందడి జోరుగా ఉండబోతోంది. ఇలా ఒకేసారి 4 సినిమాల అప్ డేట్స్ తో పుట్టినరోజు జరుపుకోవడం బహుశా చిరంజీవికి ఇదే తొలిసారి కావొచ్చు.