కమెడియన్, నిర్మాత బండ్ల గణేష్ హీరోగా మారుతున్నారు. ఆయన పాత్రే కీలకంగా ఓ తమిళ రీమేక్ కు కొత్త దర్శకుడు శ్రీకారం చుట్టారు.
ఆ దర్శకుడే నిర్మాత కూడా అని తెలుస్తోంది. నాలుగయిదు రోజుల క్రితం వెంకట్ చంద్ర అనే కొత్త దర్శకుడు బండ్ల గణేష్ ను కలిసి కథ చెప్పి డీల్ ఫైనల్ చేసుకున్నాడు.
పారితోషికం దగ్గరకు వచ్చేసరికి, కథ, ప్రాజెక్ట్ నచ్చడంతో బండ్ల బేరం ఆడకుండానే, ఎంత ఇవ్వగలవు అని అడిగి మరీ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది పాతిక లక్షలు ఇవ్వగలను అని చెప్పడంతో, అంతే ఇవ్వు అని చెప్పి ప్రాజెక్టు ఓకె చేసినట్లు తెలుస్తోంది.
సినిమాను వీలయినంత ఫాస్ట్ గా, తక్కువ షెడ్యూళ్లలో పూర్తి చేస్తారు. బండ్ల కూడా ఇక నుంచి సినిమాల్లో నటించడంపై ఎక్కువ దృష్టి పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.