పాన్ ఇండియా డైరక్టర్ శంకర్ తొలిసారి తెలుగులో, రామ్ చరణ్ హీరోగా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో స్టార్టింగ్ టు ఎండ్ హీరోతో పాటు వుండే కీలకమైన కమెడియన్ పాత్ర కు సునీల్ ను ఎంపిక చేసారు.
ఈ మధ్య కాలంగా ఇంత లెగ్తీ కామెడీ రోల్ సునీల్ కు రాలేదు. శంకర్ సినిమాలు అన్నింటిలో హీరోతో సమానంగా కమెడియన్ రోల్ ఒకటి రన్ అవుతూ వుంటుంది. అదే ఫార్ములా రామ్ చరణ్ సినిమాలో కూడా వుంది.
దానికి శంకర్ నే స్వయంగా సునీల్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.అంతేకాదు ఆ విషయాన్ని ఆయనే స్వయంగా సునీల్ కు ఫోన్ చేసి వివరించినట్లు బోగట్టా. ఈ ఏడాది సునీల్ కు భలే కలిసి వచ్చిన సంవత్సరం అనుకోవాలి.
కలర్ ఫొటోతో విలనిజం పండించి, పుష్ప సినిమాలో మెయిన్ విలన్ గా ఎంపికయ్యాడు. ఇప్పుడు రామ్ చరణ్ సినిమాలో మెయిన్ కమెడియన్ గా ఎంపికయ్యాడు.