ఎక్స్ క్లూజివ్ – ఇండియన్ 3 రెడీ!

భారతీయుడు సినిమా వచ్చిన తరువాత చాలా కాలం వార్తల్లోనే వుంది. ఇండియన్ 2 అనే సినిమా. కమల్ హాసన్-శంకర్ కాంబినేషన్ మళ్లీ మరోసారి అసలు వస్తుంది అని ఎవ్వరూ అనుకోలేదు. కానీ విక్రమ్ సినిమా…

భారతీయుడు సినిమా వచ్చిన తరువాత చాలా కాలం వార్తల్లోనే వుంది. ఇండియన్ 2 అనే సినిమా. కమల్ హాసన్-శంకర్ కాంబినేషన్ మళ్లీ మరోసారి అసలు వస్తుంది అని ఎవ్వరూ అనుకోలేదు. కానీ విక్రమ్ సినిమా బ్లాక్ బస్టర్ కాగానే చటుక్కున పట్టాలు ఎక్కేసింది.

2024 సమ్మర్ విడుదల టార్గెట్ గా సినిమా చకచకా షూట్ జరుగుతోంది. డిసెంబర్ నాటికి ఇండియన్ 2 షూటింగ్ మొత్తం పూర్తి అయిపోతుందట. అయితే అది కాదు వార్త.. ఇండియన్ 3 కూడా వుంది.. అది కూడా షూటింగ్ పూర్తయిపోతుంది ఇండియన్ 2 తో పాటే అన్నది అసలు సిసలు వార్త. 

ఇండియన్ 2 స్టార్ట్ చేసిన కొన్నాళ్లకు కమల్ కు శంకర్ కు జరిగిన డిస్కషన్ లో ఇండియన్ త్రీ ఐడియా పుట్టింది. దాంతో స్క్రిప్ట్ లో దానికి అనుగుణంగా మార్పులు చేసారు. దాంతో అనుకున్నదానికన్నా మరో 40 రోజులు వర్క్ చేస్తే చాలు ఇండియన్ 2, ఇండియన్ 3 రెండూ రెడీ అయిపోతాయని డిసైడ్ అయ్యారు.

ఈ మేరకు లైకా సంస్థతో కలిసి చర్చలు జరిపారు. ఈ పెరిగిన రోజుల మేరకు కమల్ కు, శంకర్ కు అదనపు రెమ్యూనిరేషన్ ను ఫిక్స్ చేసారు. ఆ విధంగా ఒకేసారి ఇండియన్ 2, ఇండియన్ 3 రెండూ షూటింగ్ జరిగిపోతున్నాయి. అంటే ఇండియన్ 2 సమ్మర్ లో వస్తే, కొన్నాళ్ల తరువాత 3 వస్తుందన్న మాట. మరి ఈ లెక్కన శంకర్ చేస్తున్న రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా ఎప్పుడు వస్తుందో?