ఫ్యామిలీ మేన్ సీజన్-2తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది సమంత. ఆ సిరీస్ లో ఆమె చేసిన మహిళా కమాండో పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు అదే క్రేజ్ తో ఆమెకు బాలీవుడ్ ఆఫర్లు కూడా వస్తున్నాయట. అయితే సమంత మాత్రం టాలీవుడ్ లో ఫాలో అవుతున్న ఫార్ములానే బాలీవుడ్ లో కూడా అనుసరించాలని అనుకుంటోంది.
“వెబ్ సిరీస్ రూపంలో బాలీవుడ్ నాకు చాలా పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఛాలెంజింగ్ రోల్స్ చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధమే. వెబ్ సిరీస్ ఇచ్చిన ఉత్సాహంతో ఇప్పుడు నేను అన్ని భాషల్లో వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాను. బాలీవుడ్ లో నటించడం మాత్రమే నా ప్రాధాన్యం కాదు, ఏ భాషలోనైనా మంచి స్క్రిప్ట్ ను వెదికి పట్టుకోవడమే నా ఎజెండా. ఏ నిర్ణయమైనా మనస్ఫూర్తిగా తీసుకుంటాను.”
ఇలా బాలీవుడ్ ఆఫర్లపై స్పందించింది సమంత. ఒకవేళ బాలీవుడ్ లో మంచి ఆఫర్ వచ్చినప్పటికీ, హైదరాబాద్ నుంచి మకాం మార్చే ఉద్దేశం లేదంటున్న సమంత.. కొత్త రోల్స్ కోసం వెయిటింగ్ అంటూ ప్రకటించింది.
“హైదరాబాద్ నాకు చాలా ఇచ్చింది. ఇప్పటికిప్పుడు హైదరాబాద్ వదిలి ముంబయిలో మకాం పెట్టాలని అనుకోవడం లేదు. మనం ఎక్కడున్నాం అనేది ముఖ్యం కాదు, ఇంతకుముందు చేయని పాత్రలు పోషించామా లేదా అనేది ముఖ్యం. చేసిన రోల్స్ మళ్లీ మళ్లీ చేస్తే ఆడియన్స్ కు బోర్ కొడుతుంది.”
ప్రస్తుతం తెలుగులో శాకుంతలం సినిమాలో నటిస్తోంది సమంత. తమిళ్ లో విజయ్ సేతుపతి సినిమా చేస్తోంది. ప్రస్తుతానికి సమంత చేతిలో ఉన్న ప్రాజెక్టులు ఇవే.