ఫిట్ గా మారడం కోసం సినిమా

ఎవరైనా సక్సెస్ కోసం సినిమాలు చేస్తారు, డబ్బుల కోసం సినిమాలు చేస్తారు. క్రేజ్ కోసం సినిమాలు చేస్తారు. కానీ వినాయక్ మాత్రం ఫిట్ నెస్ కోసం సినిమా చేస్తున్నాడు. అవును.. తను కేవలం ఫిట్…

ఎవరైనా సక్సెస్ కోసం సినిమాలు చేస్తారు, డబ్బుల కోసం సినిమాలు చేస్తారు. క్రేజ్ కోసం సినిమాలు చేస్తారు. కానీ వినాయక్ మాత్రం ఫిట్ నెస్ కోసం సినిమా చేస్తున్నాడు. అవును.. తను కేవలం ఫిట్ గా మారడం కోసమే హీరోగా నటించడానికి ఒప్పుకున్నానంటున్నాడు వీవీ వినాయక్.

కొన్నాళ్లుగా బాగా లావెక్కాడు వినాయక్. పెరిగిన బరువును తగ్గించుకోవడం అతడికి కష్టంగా మారింది. సరిగ్గా అదే టైమ్ లో హీరోగా నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమాలో నటించాలంటే బరువు తగ్గాల్సిందే. అందుకే నటించడానికి ఒప్పుకున్నానని, పెద్ద హీరో అయిపోదామని కాదంటూ స్టేట్ మెంట్ ఇచ్చాడు వినాయక్. తను ఫిట్ గా మారడానికి ఓ కారణం, ఓ టార్గెట్ కావాలి కాబట్టి హీరోగా మారానంటున్నాడు.

దిల్ రాజు నిర్మాతగా నరసింహరావు అనే వ్యక్తిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ సినిమా రాబోతోంది. అక్టోబర్ 9న ఈ సినిమాను ప్రారంభిస్తారు. ఆ వెంటనే రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. అప్పటికి ఓ మంచి ఫిజిక్ సాధిస్తానంటున్నాడు వినాయక్. ఇందులో మధ్యవయష్కుడి పాత్రలో తను కనిపించబోతున్నట్టు తెలిపాడు.

మరోవైపు తన దర్శకత్వంలో రాబోతున్న సినిమాపై కూడా వినాయక్ కసరత్తు ప్రారంభించాడు. మొన్నటివరకు బాలయ్యతో సినిమా కోసం ప్రయత్నించి ఫెయిలైన ఈ దర్శకుడు, త్వరలోనే రవితేజ హీరోగా నల్లమలపు బుజ్జి నిర్మాణంలో సినిమా చేయబోతున్నాడు. కాకపోతే ఈ ప్రాజెక్టుకు ఇంకా టైమ్ ఉంది. రవితేజ మహాసముద్రం అనే సినిమాను పూర్తిచేసిన తర్వాతే ఇది మొదలవుతుంది.

కుదిరితే వైసీపీ లేదంటే బీజీపీ.. మరోవైపు సోదరుడి చీలిక