నాన్నమ్మ పాత్రకు కూడా సిద్ధం

తను ఓ సినిమాకు ఎన్ని కాల్షీట్లు కేటాయించాను, సినిమాలో తన పాత్ర ఎంత ఉందనేది ముఖ్యం కాదంటోంది అనసూయ. చేసింది చిన్న పాత్రే అయినప్పటికీ తనకు గుర్తింపు ఉందా లేదా అనే విషయాన్ని మాత్రమే…

తను ఓ సినిమాకు ఎన్ని కాల్షీట్లు కేటాయించాను, సినిమాలో తన పాత్ర ఎంత ఉందనేది ముఖ్యం కాదంటోంది అనసూయ. చేసింది చిన్న పాత్రే అయినప్పటికీ తనకు గుర్తింపు ఉందా లేదా అనే విషయాన్ని మాత్రమే చూస్తానంటోంది.

“యాత్ర సినిమా కోసం నేను కేవలం 3 రోజులు మాత్రమే పనిచేశాను. కానీ ఆ సినిమాతో నాకు చాలా గుర్తింపు వచ్చింది. అలాగే రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర కూడా అంతే. సుకుమార్ చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ వెళ్లాను. అది నాకు ఎంత పేరు తెచ్చిందో అందరికీ తెలిసిందే.”

కేవలం మెయిన్ లీడ్ గా నటించడం తన కోరిక కాదంటోంది అనసూయ. క్యారెక్టర్ బాగుంటే నాన్నమ్మ పాత్ర పోషించడానికి కూడా రెడీ అని ప్రకటించింది. ఆమె నటించిన కథనం సినిమా ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అనసూయ.. కథనం సినిమాకు ముందు 12 కథలు విన్నట్టు తెలిపింది.

“క‌థ‌నం సినిమా నేను మెయిన్ హీరోయిన్‌గా విన్న తొలి సినిమా క‌థేం కాదు. చాలా క‌థ‌లే విన్నాను. రంగ‌స్థ‌లం, క‌థ‌నం మ‌ధ్య 12-13 క‌థ‌ల‌ు విన్నాను. కానీ ఇది మాత్రమే బాగా నచ్చింది. అందుకే వెంటనే ఓకే చెప్పాను. చేసిన ప‌నికి క‌చ్చిత‌మైన గుర్తింపు రాక‌పొతే నేను డిసప్పాయింట్ అవుతాను. అందుకే పాత్రల విషయంలో జాగ్రత్తగా ఉంటాను.”

ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు పూర్తి చేసుకున్న అనసూయ.. రంగస్థలం, క్షణం లాంటి  సినిమాలు మరిన్ని చేస్తానని ప్రకటించింది. ప్రస్తుతం తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది ఈ జబర్దస్త్ బ్యూటీ.

కుదిరితే వైసీపీ లేదంటే బీజీపీ.. మరోవైపు సోదరుడి చీలిక