ట్విట్టరెక్కి కూత పెడుతున్న తెలుగుదేశం ఎమ్మెల్సీ నారా లోకేష్ పై పవర్ పంచ్ విసిరారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా. ట్విట్టర్లో లోకేష్ బాబు రాజకీయం సాగుతున్న సంగతి తెలిసిందే. అక్కడ లోకేష్ బాబు స్పందించని అంశం అంటూ ఏదీ ఉండదు. బరువైన పదాలు, పెద్ద పెద్ద వాక్యాలతో లోకేష్ స్పందన వ్యక్తం అవుతూ ఉంటుంది. బయటకు వస్తే మైకు ముందు లోకేష్ పదాలు పలికే తీరుకూ, ఆ వాక్యాలకూ ఏ మాత్రం పొంతన ఉండదని పరిశీలకులు అంటూ ఉంటారు.
ఎవరో రాసిన ట్వీట్లను లోకేష్ పేరుతో పోస్టు చేసి అదే రాజకీయం అనుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు విరుచుకుపడుతూ ఉన్నారు. అయితే లోకేష్ మాత్రం ట్విట్టర్లో మాత్రమే గట్టి మాటలు మాట్లాడుతూ, శాసనమండలిలో కానీ, బయట మీడియాతో కానీ ఆ వాక్యాలను అయినా వల్లె వేసే ప్రయత్నం చేయడంలేదు. ఆ సంగతలా ఉంటే.. లోకేష్ ట్వీట్లపై రోజా ఘాటుగా స్పందించారు.
'ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయి నారా లోకేష్ అలా తయారయ్యారు. ఎమ్మెల్యేగా ఓడిపోయిన నిస్పృహలో ఆయన ఏదేదో మాట్లాడుతున్నారు..' అన్నట్టుగా రోజా స్పందించారు. లోకేష్ ఏదేదో ట్వీట్ చేస్తూ ఉంటే, ఆయన కనీసం ఎమ్మెల్యేగా నెగ్గలేకపోయిన వైనాన్ని రోజా ఒత్తి చెప్పారు. ఈ విషయంపై లోకేష్ ట్విట్టర్లో బదులిస్తారా?