ఇంకా భయమెందుకు చంద్రబాబు?

''ఆల్రెడీ భారతీయ జనతా పార్టీకి అవసరం అయినట్టుగా రాజ్యసభ సభ్యులను పంపించారు. వారిని బీజేపీలోకి విలీనం చేసేశారు. బీజేపీకి అవసరమైన పనులు చేసేశాకా.. ఇంకా భయం ఎందుకు? కేసులు పెట్టకుండా రాజీ ప్రయత్నాల్లో భాగంగానే కదా..…

''ఆల్రెడీ భారతీయ జనతా పార్టీకి అవసరం అయినట్టుగా రాజ్యసభ సభ్యులను పంపించారు. వారిని బీజేపీలోకి విలీనం చేసేశారు. బీజేపీకి అవసరమైన పనులు చేసేశాకా.. ఇంకా భయం ఎందుకు? కేసులు పెట్టకుండా రాజీ ప్రయత్నాల్లో భాగంగానే కదా.. కమలం పార్టీలోకి ఎంపీలను పంపించింది?'' అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఉద్దేశించి ప్రశ్నించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి. చంద్రబాబు నాయుడు చేసిన వివిధ కామెంట్లపై విజయసాయి రెడ్డి స్పందించారు.

''ప్రజాతీర్పు వచ్చి మూడు నెలలైనా ఎందుకు ఓడిపోయానో తెలియదనడానికి సిగ్గనిపించట్లేదా చంద్రబాబు గారూ?  పాడి ఆవులాంటి ప్రభుత్వ ఖజానాను పిండుకున్నది తమరే కదా. ప్రజల నోటికాడ ముద్దను తిన్నదికాక మీకు మీరు గోమాతగా అభివర్ణించుకోవడం పెద్ద జోక్.

అవినీతి కేసులు పెట్టకుండా వదిలేస్తే టీడీపీని బిజెపిలో విలీనం చేస్తానని రాయబారాలు పంపింది మీరే కదా చంద్రబాబు గారూ? రాజీలో భాగంగానే నలుగురు రాజ్యసభ సభ్యులను బిజెపీలోకి పంపించారు. ఇంకా మీపైన ఫిర్యాదు చేస్తారన్న భయమెందుకు? భవిష్యత్తు కళ్లముందు కనిపిస్తోందా?

మీరూ, మీ పార్టీ పెద్దలు రాష్ట్రాన్ని ఐదేళ్లపాటు బందిపోట్లలా దోచుకున్నారే తప్ప ప్రజల గురించి పట్టించుకోలేదు. అందుకే ప్రజలు అధికార పీఠం నుంచి లాగిపడేశారు. ఆత్మ పరిశీలన మరచి నేనిచ్చిన నీళ్లు తాగారు, నా రోడ్లపై నడిచారు అని హేళన చేయడమేమిటి? హెరిటేజ్ డబ్బులేమైనా ఖర్చు పెట్టారా?''  అంటూ విరుచుకుపడ్డారు ఈ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ.

కుదిరితే వైసీపీ లేదంటే బీజీపీ.. మరోవైపు సోదరుడి చీలిక