సినిమా వాళ్లు మ‌నుషులే కాదు

సీఎం వైఎస్ జ‌గ‌న్‌ను  సినిమా వాళ్లు క‌ల‌వ‌డ‌మే పెద్ద నేర‌మైంది. తెలంగాణ ప్ర‌భుత్వంతో చిరంజీవి, నాగార్జున‌, ఇత‌ర సెల‌బ్రిటీలు చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డం కూడా తీవ్ర త‌ప్పిద‌మైంది. సినిమా ప‌రిశ్ర‌మ కేవ‌లం త‌మ క‌బంధ హ‌స్తాల్లోనే…

సీఎం వైఎస్ జ‌గ‌న్‌ను  సినిమా వాళ్లు క‌ల‌వ‌డ‌మే పెద్ద నేర‌మైంది. తెలంగాణ ప్ర‌భుత్వంతో చిరంజీవి, నాగార్జున‌, ఇత‌ర సెల‌బ్రిటీలు చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డం కూడా తీవ్ర త‌ప్పిద‌మైంది. సినిమా ప‌రిశ్ర‌మ కేవ‌లం త‌మ క‌బంధ హ‌స్తాల్లోనే ఉండాల‌ని శాసించే ఓ సామాజిక వ‌ర్గానికి …చిరంజీవి నేతృత్వంలో విభిన్నంగా ఆలోచించ‌డం ఏ మాత్రం గిట్ట‌డం లేదు. దీంతో చిరుతో పాటు సొంత సామాజిక వ‌ర్గానికి చెందిన నాగార్జున త‌దిత‌రుల‌పై ఉద్దేశ పూర్వ‌కంగానే దుష్ప్ర‌చారం మొద‌లు పెట్టారు.

ప్ర‌జ‌ల‌తో ప్ర‌త్య‌క్ష సంబంధం లేని కొంద‌రిని ఎంపిక చేసుకుని చిరుతో పాటు ఇత‌ర సినీ సెల‌బ్రిటీల‌ను తిట్టిస్తున్నారు. దీనికి తాజా ఉదాహ‌ర‌ణ బీజేపీ నాయ‌కురాలు సాధినేని యామినిశ‌ర్మ త‌న స్థాయి, విచ‌క్ష‌ణ మ‌రిచి సినీ సెల‌బ్రిటీల‌పై దూషణ ప‌ర్వానికి దిగ‌డ‌మే. ఏబీఎన్ చాన‌ల్‌లో ఆమె మాట్లాడుతూ సినీ ప‌రిశ్ర‌మ‌పై తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.

ప్రపంచంలో ప్రజలు చచ్చినా వారికి ఫర్వాలేదని.. పిరికితనంగా ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ప్రాంతం వారి గురించి మాట్లాడితే ఎక్కడ తమ సినిమాలు ఆగిపోతాయనే భయం తప్ప మరొకటి లేదని ఆమె వ్యాఖ్యానించారు. సినీ హీరోలు నిజ జీవితంలో క‌నీసం మ‌నుషులుగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. అంటే వాళ్లు మ‌నుషులే కాద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు.

రైతుల గురించి చిరంజీవి ఖైదీ నంబర్ 150 అనే స్ఫూర్తిదాయక సినిమా తీశారని, మరి అమరావతి రైతులను పట్టించుకోరా అని సాధినేని యామినిశ‌ర్మ‌  నిలదీశారు. రాజ‌ధాని మ‌హిళా రైతులు ప్లకార్డులు పట్టుకుని ఆందోళ‌న చేస్తుంటే కనీసం వారి ఆవేదన పట్టించుకోరా అని ప్రశ్నించారు.  సినిమా వాళ్లు అమరావతి విషయంలోనే కాదని, ఎల్జీ పాలిమర్స్ ఘటనలో చనిపోయినా, తిత్లీ తుఫాన్ వచ్చినా, ఏ ప్రభుత్వంలో ఏం జరుగుతున్నా సరిగ్గా స్పందించరని ఘాటుగా విమర్శించారు. సీఎంతో భేటీ అయినవాళ్లు పక్కా వ్యాపారలావాదేవీల గురించి మాట్లాడుకోవడానికే వచ్చారన్నారు.

సినిమా వాళ్ల‌పై ఇప్పుడే విమ‌ర్శ‌లు ఎందుకో అర్థం చేసుకోలేని అమాయ‌క ప్ర‌జ‌లు లేర‌ని యామినిశ‌ర్మ గుర్తిస్తే మంచిది. క‌రోనా మ‌హ‌మ్మారి స‌మాజాన్ని అత‌లాకుత‌లం చేస్తుంటే…ప్ర‌జ‌ల్ని ఆదుకునేందుకు సినీ సెలిబ్రిటీలు పెద్ద ఎత్తున విరాళాలు అంద జేసిన విష‌యాన్ని మ‌రిచిపోయి, విమ‌ర్శ‌ల‌కు దిగ‌డం ఆమె సంస్కారాన్ని సూచిస్తోంది. ఖైదీ నంబ‌ర్ 150 సినిమాలో కార్పొరేట్ శ‌క్తుల‌ను వ్య‌తిరేకించే పాత్ర‌లో చిరంజీవి స్ఫూర్తిదాయ‌క పాత్ర పోషించారనేది నిజం.

మ‌రి అమ‌రావ‌తి రైతుల విష‌యంలో మాత్రం చిరంజీవి ఎందుకు స్పందించ‌లేద‌న్న‌ది ఎల్లో మీడియా కొంద‌రిని అడ్డుపెట్టుకుని ప్ర‌శ్నిస్తోంది. ఎల్లో మీడియాకు ఒక‌టే స‌మాధానం…అమ‌రావ‌తిలో మాత్రం కార్పొరేట్ శ‌క్తులు కాక మ‌రేంటి?  రాజ‌ధాని ప్రాంతంలో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాళ్ల ఆందోళ‌న‌కు సినీ సెలబ్రిటీలు మ‌ద్ద‌తు ఇవ్వాలని వాళ్ల త‌ర‌పున వ‌కాల్లా పుచ్చుకుని నానా యాగీ చేయ‌డానికి సిగ్గుగా లేదా? ప‌్ర‌తి దానికి ఆడ‌వాళ్ల‌ను ముందు పెట్టి రాజ‌కీయాలు చేయ‌డం ఘ‌న కార్య‌మ‌ని అనుకుంటున్నారా? ఏమిటీ విప‌రీత ధోర‌ణులు?

ఇదే రాజ‌ధాని రైతులు ఆందోళ‌న చేస్తుంటే టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న టాలీవుడ్ అగ్ర‌హీరో బాల‌కృష్ణ ఎందుకు స్పందించ‌లేద‌ని ఏనాడైనా ఎల్లో చాన‌ళ్లు డిబేట్లు పెట్టాయా? టీడీపీ కోసం ప‌నిచేసే సాధినేని లాంటి వాళ్లు ఎందుకు ప్ర‌శ్నించ‌లేదు? అధికారం నుంచి దిగిపోయినా…ఇంకా త‌మ పెత్త‌న‌మే చెల్లుబాటు కావాల‌నే అహంకారం త‌ప్ప ప్ర‌జ‌ల‌పై ప్రేమ‌తో చేస్తున్న విమర్శ‌లా?  టీడీపీ అధికారంలో ఉన్నంత వ‌ర‌కూ చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు లోకేశ్ కోసం ప‌నిచేసిన యామిని…ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలోకి జంప్ అయి కొత్త పాత్ర‌లో ఎల్లో స్క్రిప్ట్ చ‌ద‌వ‌డం ఆమెకే చెల్లు.

జగన్ గారికి చాలా థాంక్స్

‘జగనన్న చేదోడు’ ప్రారంభం