బాల‌య్య బ‌ర్త్‌డే విషెస్‌లో చిరు ట్వీట్‌ ప్ర‌త్యేకం

టాలీవుడ్ అగ్ర‌హీరో నంద‌మూరి బాల‌కృష్ణ‌ నేటితో 60వ వ‌సంతంలోకి అడుగు పెట్టారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా బాల‌య్య‌కు శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. వీట‌న్నింటిలో ఒకే ఒక్క వ్య‌క్తి విషెస్ ఎంతో ప్ర‌త్యేకం. ఆయ‌నే మెగాస్టార్ చిరంజీవి.…

టాలీవుడ్ అగ్ర‌హీరో నంద‌మూరి బాల‌కృష్ణ‌ నేటితో 60వ వ‌సంతంలోకి అడుగు పెట్టారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా బాల‌య్య‌కు శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. వీట‌న్నింటిలో ఒకే ఒక్క వ్య‌క్తి విషెస్ ఎంతో ప్ర‌త్యేకం. ఆయ‌నే మెగాస్టార్ చిరంజీవి.

బాల‌య్య‌కు చిరు శుభాకాంక్ష‌లు చెప్ప‌డంలో ఓ ప్ర‌త్యేక‌త ఉంది. ఎందుకంటే వారం, ప‌ది రోజులుగా బాల‌య్య, మెగా అభిమానుల మ‌ధ్య ఉప్పునిప్పులా ప‌రిస్థితి త‌యారైంది. ఈ పరిస్థితికి బాల‌య్య ఆరోప‌ణ‌లు, వాటిపై నాగ‌బాబు స్పంద‌న అని చెప్ప‌క త‌ప్ప‌దు. ఎందుకంటే వాస్త‌వం అదే కాబ‌ట్టి.

అంతెందుకు త‌న పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని రెండు రోజులుగా బాల‌య్య ప‌లు చాన‌ళ్ల‌కు ఇంట‌ర్వ్యూలు ఇస్తూ చాలా బిజీగా ఉన్నారు. ఈ ఇంట‌ర్వ్యూల్లో చిరంజీవిని టార్గెట్ చేస్తూ ప‌రోక్షంగా బాల‌య్య త‌న‌దైన స్టైల్‌లో పంచ్ డైలాగ్‌లు చెబుతుం డ‌డం గ‌మ‌నార్హం.

చిరంజీవి ఇంట్లో మీటింగ్ పెట్ట‌డం మొద‌లుకుని ఇత‌ర‌త్రా కార్య‌క్ర‌మాల‌కు ఆహ్వానం లేక‌పోవ‌డంపై బాల‌య్య ర‌గిలిపోతున్నారు. దీంతో ఒక్కో ఇంట‌ర్వ్యూలో ఒక్కో అంశాన్ని బాల‌య్య ప్ర‌స్తావిస్తూ చిరంజీవి నాయ‌క‌త్వాన్ని త‌గ్గించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు లేక‌పోలేదు. చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ఒక‌ప్పుడు పెద్ద దిక్కుగా ఉన్న దాస‌రి స్థానాన్ని…తాజాగా చిరు భ‌ర్తీ చేస్తున్నాడ‌నే ప్ర‌శ్న‌కు అలాంటిదేమీ లేద‌ని బాల‌య్య తెగేసి చెప్పాడు. అంతేకాదు దాస‌రి స్థానాన్ని ఎవ‌రూ భ‌ర్తీ చేయ‌లేర‌ని కూడా బాల‌య్య చెప్ప‌డం చిరు ప్ర‌య‌త్నాల‌ను చుల‌క‌న చేయ‌డ‌మే అని మెగా అభిమానులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో బాల‌య్య‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెబుతూ చిరంజీవి ట్వీట్ చేశారు. బాల‌య్య యోగ‌క్షేమాల‌ను కాంక్షిస్తూ చిరు చేసిన ఆ ట్వీట్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.  

‘‘60లోకి అడుగుపెడుతున్న మా బాలకృష్ణకి  షష్టిపూర్తి శుభాకాంక్షలు. ఇదే ఉత్సాహంతో, ఉత్తేజంతో ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ల సంబరం కూడా జరుపుకోవాలని, అందరి అభిమానం ఇలాగే పొందాలని కోరుకుంటున్నాను. డియర్ బాలకృష్ణ.. 60వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా మీ అద్భుతమైన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటున్నా. హ్యాపీ బర్త్‌డే’’ అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

ఒక వైపు బాల‌య్య త‌న‌ను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నా…చిరు ఏ మాత్రం బ్యాలెన్స్ త‌ప్ప‌లేదు. పైపెచ్చు ప్రేమ‌ను పంచుతూ మా బాల‌య్య అంటూ, బ‌ర్త్‌డే విషెస్ చెబుతూ చ‌క్క‌టి ట్వీట్ చేశారు. ఇదే చిరంజీవి ప్ర‌త్యేక‌త‌. ఒక ర‌కంగా చిరు స్థాయి ఏంటో బాల‌య్య‌కు విషెస్ తెలియ‌జేసే ట్వీటే చెబుతోంద‌ని మెగా అభిమానులు సోష‌ల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.