BS-3వాహనాలను BS-4గా మార్చి విక్రయించారనే కేసులో మరోసారి ఈడీ విచారణకు హాజరుకానున్నారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. నిన్న 9 గంటల పాటు ప్రశ్నించిన ఈడీ అధికారులు ఇవాళ కూడా విచారణ చేయనున్నారు.
అశోక్ లైలాండ్ కంపెనీకి చెందిన నిషేదిత బీఎస్-3 వాహనాలను కొనుగోలు చేసీ బీఎస్-4గా మార్చి రిజిస్ట్రేషన్ చేశారన్న ఆరోపణలపై జేసీ ట్రావెల్స్ పై పలు కేసులు నమోదైయాయి. నిన్న విచారణ అనంతరం జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నిజాయితీని నిరూపించుకోవడానికి ఈడీ సరైన చోటన్నారు. తనకు తానుగా పెద్ద నిజాయితీ పరుడిని అని చెప్పుకున్నారు
మొత్తానికి 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయా జీవితంలో ఈడీ కేసులు ఎదుర్కొంటూన్నారు. తన వాహనాలు ఎక్కడైనా అధికారులు అపితే వారిపై దాడులు చేస్తూ సాగిన ట్రావెల్స్ బిజినేస్ కాస్తా ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఒక వైపు వారసుల రాజకీయం కలిసి రావడం లేదని ఒక బాధ అయితే తాము చేసిన తప్పులు ఒకొక్కటిగా బయటకు రావడంతో తీవ్ర నిరాశతో జేసీ బ్రదర్స్ కనపడుతున్నారు.