ఘోర ప్రమాదం.. 11 మంది సజీవదహనం!

మహారాష్ట్ర‌లోని నాసిక్-ఔరంగాబాద్ హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. య‌వ‌త్మాల్ నుంచి ముంబై వెళ్తున్న బ‌స్సు నాసిక్ నుండి పూణె వెళ్తున్న ట్ర‌క్కును ఎదురుగా ఢీకొన‌డంతో మంటలు చెల‌రేగి 11 మంది స‌జీవ‌ద‌హ‌నం అయ్యారు,…

మహారాష్ట్ర‌లోని నాసిక్-ఔరంగాబాద్ హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. య‌వ‌త్మాల్ నుంచి ముంబై వెళ్తున్న బ‌స్సు నాసిక్ నుండి పూణె వెళ్తున్న ట్ర‌క్కును ఎదురుగా ఢీకొన‌డంతో మంటలు చెల‌రేగి 11 మంది స‌జీవ‌ద‌హ‌నం అయ్యారు, 38 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య ఇంక పెర‌గ‌వ‌చ్చాని అధికారులు భావిస్తున్నారు.

తెల్ల‌వారు జామున కావ‌డంతో ప్ర‌యాణికులు గాడ నిద్ర‌లో ఉండ‌టం వల్ల ప్ర‌మాదం తీవ్ర‌త ఎక్కువ‌గా జ‌రిగిన‌ట్లు అధికారులు బావిస్తున్నారు. తరుచుగా లగ్జరీ ప్యాసింజర్ బస్సులు ఏదైనా ప్ర‌మాదం జ‌రిగితే మంట‌ల్లో చిక్కుకొని ప్ర‌యాణికులు స‌జీవ‌ద‌హ‌నం అవుతున్నారు. ప్ర‌మాద‌లు జ‌రుగుతున్న ప్ర‌భుత్వాల నుండి కానీ బ‌స్సు యజమానులు కూడా జాగ్ర‌త తీసుకొక‌పోవ‌డం బాధాకరం. 

ప్ర‌మాద‌ ఘ‌ట‌నపై మ‌హారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ, ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన వారి కుటుంబాల‌కు ఒక్కొక్క‌రికి రూ. 5ల‌క్ష‌లు, క్ష‌త‌గాత్రుల వైద్య ఖ‌ర్చులు ప్ర‌భుత్వంమే భరిస్తుందని ప్ర‌క‌టించారు. అలాగే ప్రధాని న‌రేంద్ర మోడీ ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ వ్య‌క్తం చేస్తూ మృతుల కుటుంబాల‌కు ఒక్కొక్క‌రికి రూ. 2ల‌క్ష‌లు, గాయ‌ప‌డిన వారికి 50 వేల చెప్పున్న సాయాన్ని ప్ర‌క‌టించారు.