గత కొంత కాలంగా సమంత జాడ తెలియడం లేదు. ఆమె విదేశాలకు వెళ్లారు. వచ్చారు. అలా కొంతకాలం గడిచింది. ఇప్పుడు కూడా హైదరాబాద్ లో లేరు. సమంత స్కిన్ ప్రోబ్లమ్ తో బాధపడుతున్నారని వార్తలు వచ్చాయి. అందుకే ట్రీట్ మెంట్ కోసం అమెరికా వెళ్లారని, అంతకు ముందు పూజలు, హోమాలు చేయించారని రకరకాల వార్తలు వచ్చాయి. కానీ సమంత టీమ్ వైపు నుంచి అవన్నీ తప్పు అంటూ ఖండన వచ్చిందనీ వార్తలు వచ్చాయి.
మొత్తం మీద ఏదో జరుగుతోంది. సమంత చేస్తున్న రెండు సినిమాలు యశోద, శాకుంతలం అలా వుండిపోయాయి. త్రీడీ వెర్షన్ అనే మాట చెప్పి, శాకుంతలం సినిమాను వచ్చే ఏడాదికి వాయిదా వేసేసారు. యశోద సినిమా డేట్ ఇవ్వలేదు కానీ డబ్బింగ్ వర్క్ పెండింగ్ లో పడింది.
విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం సమంత ప్రస్తుతం కోయంబత్తూరు లోని ఈషా ఫౌండేషన్ లో వున్నారని తెలుస్తోంది. మరి అక్కడ ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారో లేదా, ఇటీవల వరుసగా వస్తున్న సమస్యల కారణంగా కాస్త మనశ్శాంతిగా వుంటుందని అక్కడ వున్నారో తెలియదు.
ఈ నెల 10న అక్కడి నుంచి వస్తారని తెలుస్తోంది. వచ్చిన తరువాత డబ్బింగ్ చెబితే ఆల్ ఈజ్ వెల్ అనుకోవాలి.