తమిళంలో పెద్ద హిట్ అయిన సినిమా ఓ మై కడవలే. ఈ సినిమాను తెలుగులో నిర్మాత పివిపి రీమేక్ చేస్తున్నారు. ఓరి దేవుడా అనేది టైటిల్. విష్వక్ సేన్ హీరో. సీనియర్ హీరో వెంకటేష్ ఈ సోషియో ఫాంటసీ సినిమాలో దేవుడి పాత్ర పోషిస్తున్నారు. మిహిల పాల్కర్, ఆషాభట్ హీరోయిన్లు. అశ్వధ్ దర్శకుడు.
జీవితాన్ని మార్చుకోవడం సాధ్యం కాదు. కానీ జీవితానికి అనుగుణంగా మనని మనం మార్చుకోవడం సాధ్యం అవుతుంది. చిన్నప్పటి క్రష్ అలాగే వుండగా, పెళ్లయిపోయిన హీరోకి వచ్చిన ఫ్యామిలీ ప్రోబ్లెమ్స్..వాటిని మార్చుకోవాలనే తపన..దేవుడి సాయం.. కానీ ఆ సాయంతో తెలిసి వచ్చిన వాస్తవం ఇదీ సినిమా అని ట్రయిలర్ చెబుతోంది.
విష్వక్ సేన్ కు పెర్ ఫెక్ట్ టైలర్ మేడ్ రోల్ లా వుంది. పెర్ ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. ఇద్దరు హీరోయిన్లు కూడా ఆ క్యారెక్టర్లకు అలా సరిగ్గా సరిపోయారు. సమయోచితంగా పూరి జగన్నాధ్ ను చూపించడం బాగుంది. సీనియర్ హీరో మోడనర్ దేవుడి గెటప్ లో ఫన్ ను యాడ్ చేసారు. టోటల్ గా ట్రయిలర్ ప్రామిసింగ్ గా వుంది.